-
-
విమర్శాదర్శం
Vimarshaadarsham
Author: Dr. Dwa. Na. Sastry
Publisher: Kinnera Publications
Pages: 157Language: Telugu
అసలైన విమర్శ కేవలం ఉపరిప్రశంస కాదు. అసందర్భమైన అధిక్షేప ప్రకర్ష కాదు. విమర్శకుడు సరితూక మెరిగిన విజ్ఞుడుగా ఉండాలి. అక్కడక్కడా చెణుకులు విసురుతూనే తాను ఉద్దేశించిన అంశానికి సంబంధించిన మూర్తిమత్వం ముమ్మూర్తులుగా కుదురుకోవాలి. ఆ కోవకు చెందిన సద్విమర్శకుడు ద్వానా. మరో పార్శ్వం నుంచి చూస్తే చమత్కారోక్తుల ఖజానా ద్వానా.
- జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత, డా॥ సి.నారాయణరెడ్డి
ఆధునిక తెలుగు సాహిత్యరంగంలో తన కొక సుస్థిరస్థానం కల్పించుకున్న సాహితీ వేత్త, సహృదయుడు డా. ద్వానాశాస్త్రి. విశేషం ఏమిటంటే వీరు ఎప్పుడూ సృజనాత్మక మహాయజ్ఞం చేస్తూనే వుంటారు. ఆయన ఎంతటి విమర్శకులో అంతటి సమీక్షకులు. ఎంతటి సమీక్షకులో అంతటి వక్త. ఎంతటి వక్తో అంతటి మంచిమనిషి, విశేషించి, సాహితీ కార్యకర్త కూడా.
- పద్మశ్రీ డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్
విస్తృతమైన విమర్శక వ్యాసంగం ఒక పక్కన వున్నా ద్వానాశాస్త్రి అంతరంగం కల్లా కపటంలేనిది. సన్నిహిత మిత్రులతో కూడా విభేదించేంత సాహిత్య నిబద్ధత, కొండొకచో కొంత కొంటెతనం ఆయన సొత్తు. ద్వానా శైలికి వున్న నైగనిగ్యం, ఋజుప్రకాశం, నిక్కచ్చితనం, సత్యాన్వేషణా పరత్వం చాలామందిలో వుండవు.
- డా॥ ఎన్. గోపి.
మంచి వ్యక్తిగా, మంచిమిత్రుడుగానే కాక మంచి పరిశోధకుడుగా నాకు తెలుసు. అంతేగాదు, రచయితగా, అనేక గ్రంథ సమీక్షకుడుగా మంచి ఉపన్యాసకుడుగా, ఉత్తమ అధ్యాపకుడుగా పలువురి ప్రశంసలకు పాత్రుడు కావడం, నా కళ్ళముందే ‘‘ఇంతింతై వటుడిరతై...’’ అన్నట్టు సాహిత్యరంగంలో ఉన్నత శిఖరాలు అధిరోహించడం మహానందంగా వుంది.
- డా॥ ఎస్. గంగప్ప
విషయసేకరణలో, సేకరించిన సమాచారాన్ని కూర్పుచేయడంలో జర్నలిస్టులకు ఉండే సామర్థ్యం శాస్త్రిగారికి ఉంది. మంచి అధ్యాపకుడేకాదు, మంచి సాహిత్య విమర్శకుడే కాదు, ఆయన మంచి పత్రికా రచయిత కూడా.
- డా. పొత్తూరి వెంకటేశ్వరరావు
తెలుగు విమర్శని పాపులర్ చేసినవాళ్ళున్నారు. ఆ క్రమంలో చేరా మొదటి వారు. ద్వానా రెండోవారు (ఇద్దరూ గురు శిష్యులే). అది పుస్తక సమీక్ష కావచ్చు, విమర్శకావచ్చు. ఒకానొక సందర్భంలో పాత కవిని మూల్యాంకనం చేయటం కావచ్చు. అతడేది చేసినా దేనికీ వెరవలేదు. Open minded గానే చేశాడు - చేస్తున్నాడు. ఒక నిర్భీతి కలవాడు.
- కె. శివారెడ్డి
Sir,We want Dr.Dwa Na Sastry sir Telugu Sahithya Charithra degitalised book.how we will download this ebook from kinige?
Dwana sastry gari sahitya charitra e book kavali. ee vinnapamu nu kinige angikarinchalani manavi