-
-
విజేత
Vijetha
Author: Swami Maitreya
Pages: 137Language: Telugu
ప్రతి ఒక్క పాఠకునికి విజయం, విజయంతో పాటు సంతృప్తి పొందడానికి అనుసరించవలసిన మెళకువలను, పద్ధతులను సవివరంగా వివరిస్తూ ప్రతి ఒక్కరిని విజయం దిశగా సంసిద్ధులను చేయడమే ఈ పుస్తక ముఖ్య ఉద్దేశ్యం. జీవితంలో విజయం సాధించడానికి అవసరమైన ఎన్నో శాస్త్రీయ మరియు ఆచరణాత్మక పద్ధతులను కూలంకషంగా వివరించడం జరిగింది. ప్రతి ఒక్క విద్యార్ధికి, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తకు అటు జీవితంలోను, ఇటు వృత్తిలోను ఉన్నత విజయ శిఖరాలను అధిరోహించడానికి ఈ పుస్తకం ఓ చక్కటి ఆచరణీయమైన మార్గదర్శి. విజయం సాధించదలిచే ప్రతి ఒక్కరి చెంతన ఉండవలిసిన పుస్తకం. ఓ వ్యక్తి జీవితంలో విజేతగా తీర్చిదిద్దగలిగే ఓ అరుదైన, అద్వితీయమైన పుస్తకం. ఇప్పటి వరకు మీ జీవితంలో మీకు తెలియకుండా చోటు చేసుకుంటున్న ఎన్నో తప్పులను, పొరపాట్లను సరిదిద్దుతుంది. పాశ్చ్యాత్య శాస్త్రీయ పద్ధతులను, అనుభవ ఆత్మజ్ఞానాన్ని మేళవిస్తూ ప్రతి అంశాన్ని వివరించడం జరిగింది. అంతః ప్రశాంతత లేని బాహ్య చైతన్యం నిరర్ధకం. అందుకే వ్యక్తిలో పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని పెంపొందించడం పైనే దృష్టి పెట్టడం జరిగింది. ఓ వ్యక్తి వ్యక్తిత్వాన్ని మార్చగలిగి జీవితంలో అతను కోరుకునే మంచి మార్పును తీసుకురావడంలో దోహదపడే అరుదైన పుస్తకాలలో ఈ పుస్తకం ఒకటి. ఆధ్యాత్మికతో నిండిన నాయకత్వాన్ని, విలువలతో కూడిన నిర్వహణను ఎలా పెంపొందించుకోవాలో ముఖ్యంగా వివిరించడం జరిగింది. కేవలం బాహ్య విజేతగానే కాకుండా మిమ్మల్ని మీరు జయించగలిగి అంతః విజేతగా కూడా ఎలా ఎదగాలనేది ఈ పుస్తకం వివరిస్తుంది. ప్రశాంతతను, సంతృప్తిని పణంగా పెట్టకుండా జీవితంలో విజయశిఖరాలను అధిరోహించగలిగేటట్లు ప్రతి ఒక్కరిని పరిపూర్ణమైన వ్యక్తిగా తీర్చిదిద్దడమే ఈ పుస్తక ప్రగాఢ ఆశయం, ఆకాంక్ష.
