• Vijayawada Sandarsanam
  • Ebook Hide Help
    ₹ 90
    200
    55% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • విజయవాడ సందర్శనం

    Vijayawada Sandarsanam

    Publisher: Chalapaka Prakash

    Pages: 224
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

శ్రీ చలపాక ప్రకాష్ రచయిత, కవి, కార్టూనిస్టు, పత్రికా సంపాదకుడు, ప్రచురణకర్త, సాహితీ సంస్థల, రచయితల సంఘాల నిర్మాణ, నిర్వహనాదక్షుడు. ఆయన కలం నండి నూతన సంవత్సరంలో వచ్చిన నూతన పుస్తకం 'విజయవాడ సందర్శనం'.

ఈ పుస్తకం చదువుతుంటే విజయవాడ దర్శనీయ స్థలాల యాత్రా గ్రంథంగా కనిపించినా, లోతైన చరిత్ర పరిశీలన, సామాజిక, సాంస్కృతిక పరిణామాల పరిశోధన కనిపిస్తుంది. విజయవాడలో మనల్ని విహరింప చేస్తూనే, వాటి చరిత్ర, మహోన్నతతతో పాటు నగర చీకటి వెలుగులు, అభివృద్ధి సాక్షాత్కరింప చేయడంలో శ్రీ చలపాక ప్రకాష్ సఫలీకృతుడయ్యారు.

- మండలి బుద్ధ ప్రసాద్

“దేశమైనా చూడు, కోశమైనా చూడు” అని పెద్దలు ఏనాడో చెప్పారు. దేశాన్ని చూస్తే భౌగోళిక, చారిత్రకాది విషయాలు అవగాహనకు వస్తాయి. కోశాన్ని చూస్తే శబ్ద పరిజ్ఞానం విస్తృతమవుతుంది. వీటి వల్ల వ్యక్తి మానసికమైన వికాసాన్ని పొందగలుగుతాడు. ప్రత్యక్షంగా దర్శించి తెలుసుకోలేక పోయినప్పుడు ఆయా ప్రదేశాల విషయాల్ని ఒకరి నుంచి తెలుసుకొని గాని, ఏదైనా గ్రంథాన్ని చదవటం ద్వారా గాని గ్రహించే అవకాశం ఉంటుంది. చలపాక ప్రకాష్ గారు ప్రస్తుతం పాఠకులకు తమ రచన ద్వారా 'విజయవాడ సందర్శనం' చేయిస్తున్నారు. ఇది ఆహ్వానించదగిన రచన.

- డా. గుమ్మాసాంబశివరావు

గమనిక: "విజయవాడ సందర్శనం" ఈబుక్ సైజు 7.5 mb

Preview download free pdf of this Telugu book is available at Vijayawada Sandarsanam