• Vijayarke Nalugu Navalalu
  • fb
  • Share on Google+
  • Pin it!
 • విజయార్కె 4 నవలలు

  Vijayarke Nalugu Navalalu

  Author:

  Pages: 331
  Language: Telugu
  Rating
  4.75 Star Rating: Recommended
  4.75 Star Rating: Recommended
  4.75 Star Rating: Recommended
  4.75 Star Rating: Recommended
  4.75 Star Rating: Recommended
  '4.75/5' From 16 votes.
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  5 Star Rating: Recommended
  '5/5' From 12 premium votes.
Description

మాఫియా డాన్ యాంటీ మాఫియా స్క్వాడ్‌కు చీఫ్ అయితే ?
చక్రాలకుర్చీకే అంకితమైన అతడు ప్రపంచాన్ని శాసించే అండర్ వరల్డ్ డాన్.
అప్పు చెల్లించని వైభవ్‌ని కిడ్నాప్ చేసిన కుబేరుడు...
సరాసరి కార్ లోనే ఆకాశానికి తనలోకానికి తీసుకువెళ్లిన కుబేరుడు..ఫాంటసీ కామెడీ థ్రిల్లర్ " పైసా వసూల్ "
డ్రగ్స్‌కు బానిసై ఉరికి సిద్ధమైన ఆ అమ్మాయి ఎవరికి టార్గెట్? మాదకద్రవ్యాల మీద పాతికేళ్ల క్రిందటే రాసిన క్రైమ్ థ్రిల్లర్ " టార్గెట్ 789 "
దేవుడితో రచయిత ఏం మాట్లాడాడు? ఈ ప్రపంచంలో ఎవరిష్టం వచ్చినట్టు వారు బ్రతకొచ్చు...ఒకరి ఇష్టం మరొకరికి నష్టం చేయనంత వరకు?
ఏం చేసినా " మీ ఇష్టం " నిజాల నిగ్గుతేల్చే నిఖార్సైన వ్యక్తిత్వ వికాస రచన
ఒకే పుస్తకంలో నాలుగు నవలలు రచనలు తక్కువ ధరలో కినిగె పాఠకులకు అందించాలనే ప్రయత్నమే విజయార్కె నాలుగు నవలలు.
విభిన్నమైన సబ్జక్ట్స్,వైవిధ్యమైన రచనలు,
మాఫియా, క్రైమ్ ,ఫాంటసీ థ్రిల్లర్ ,వ్యక్తిత్వ వికాసం
మీరు విడిగా కావాలనుకున్నా కినిగెలో ఈ రచనలు అందుబాటులో ఉన్నాయి.
ప్రముఖ రచయిత విజయార్కె నాలుగు నవలలు
మేన్ రోబో పబ్లికేషన్స్ ప్రచురణ

Preview download free pdf of this Telugu book is available at Vijayarke Nalugu Navalalu
Comment(s) ...

VIJAYARKE deals any subject, anywhere. His guts are in different way. His thoughts are on Human way. He reflects his humanity in his Books.
The FOUR Novels are different and interesting.
He is good writer.
That is VIJAYARKE's QUALIFICATION.
- Adapa Chiranjeevi

ఒకే పుస్తకంలో నాలుగు నవలలు అందించడం మంచి ప్రయోగం.ఒకేసారి నాలుగు రచనలు చదివే అవకాశం వుంది.అందులోనూ నాలుగు విభిన్నమైన కథాంశాలు.అండర్ వరల్డ్ నవల చదువుతుంటే ఒక మాఫియా థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టు వుంది.
"నిన్ను వారం రోజుల పాటు వంటావార్పు ప్రోగ్రాం చూసుకునే డ్యూటీ వేస్తున్నాను" అన్నాడు క్యూ టీవీ ఛానెల్ చైర్మన్
"ఏ బహుత్ అన్యాయ్" అన్న విభ్రమ డైలాగ్ శ్రీదేవిని జ్ఞప్తికి తెప్పించింది.
టార్గెట్ నవల చదువుతుంటే డ్రగ్స్ కు బానిసైన యువతే కాదు డ్రగ్స్ ను అలవాటు చేసి తీవ్రవాదులు అమాయకులను ఎలా బలి చేతున్నారో అర్థమవుతుంది.పాతికేళ్ల క్రితం రాసిన నవలలోని అంశాలు ఇప్పుడూ కొట్టగానే వున్నాయి.
పైసా వసూల్ సబ్జెక్టు విభిన్నం.కుబేరుడి దగ్గర అప్పుచేసి హీరో,అప్పుకు వడ్డీ చెల్లించనందుకు కారులో వెళ్తున్న వైభవ్ ను అలా గాల్లోకి తీసుకువెళ్లి కిడ్నాప్ చేయడం,నవ్విస్తూ ఆలోచింపజేసే ఆహ్లాదకరమైన నవల.
మీఇష్టం ప్రతీఒక్కరూ చదువవలిసిన వ్యక్తిత్వ వికాసం.ముఖ్యంగా దేవుడికి రచయితకు మధ్య జరిగిన సంభాషణ హైలెట్
రెంట్ ఆప్షన్ కూడా పెట్టి బావుండేది.

వావ్ ...గ్రేట్ ఒకే పుస్తకంలో విజయార్కె గారి నాలుగు నవలలు ఇవ్వడం మంచి ప్రయోగం.దాదాపు రెండు నవలల ఖరీదులో నాలుగు నవలలు అందించడం పాఠకులకు గిఫ్ట్ లాంటిదే.ఒకే పుస్తకం ద్వారా నాలుగు నవలలు చదువుకోవచ్చు.అందులోనూ ఒకటి మాఫియా,మరొకటి ఫాంటసీ కామెడీ,ఇంకోటి క్రైమ్,మరోటి వ్యక్తిత్వ వికాస రచన.
నాలుగు విభిన్నమైన రచనలు వైవిధ్యంగా మాకు కానుకగా అందించారు. .పాఠకాభిరుచికి అనుగుణంగా పుస్తకాలను పాఠకులకు చేరువ చేస్తున్నందుకు కినిగె వారికీ ధన్యవాదాలు

ఎక్సలెంట్ ,నాలుగు విభిన్నమైన నవలలు ఒకే పుస్తకంలో .వేటికవే విభిన్నమైన శైలిలో వున్నాయి.అండర్ వరల్డ్ పైసా వసూల్,టార్గెట్,మీ ఇష్టం, ఒకదానికి ఒక పోటీపడుతూ చదివించాయి.అన్ని ఎమోషన్స్ అక్షరాల్లో ఒదిగిపోయాయి.

చక్కని కాలక్షేపం,ఆహ్లాదం,నాలుగు డిఫరెంట్ రచనలు.క్రైమ్ మాఫియా కామెడీ,వ్యక్తిత్వవికాసం వేటికవే ప్రత్యేకంగా వున్నాయి.పైసా వసూల్ ప్లజంట్ గా వుంది.జంధ్యాలగారి సినిమా చూస్తున్నట్టు వుంది.

విజయార్కె నాలుగు రచనలు చక్కని కాలక్షేపం,అంతకు మించి ఆహ్లాదం,ఆలోచన కలిగించే పుస్తకాలు.మీ ఇష్టంలో పుస్తకంలో మనిషి జీవితం కనిపించింది.అండర్ వరల్డ్ ఒక మాఫియా థ్రిల్లర్ సినిమా చూపించింది.
పైసా వసూల్ మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే హాస్యరసాన్ని అద్భుతంగా అందించింది.ముఖ్యంగా వైభవ్ కుబేరుడిని కారుతో సహా తనలోకానికి తీసుకువెళ్లే సీన్ కొత్తగా చాలా బావుంది.
టార్గెట్ నవల ఒక వెబ్ క్రైమ్ సిరీస్ చూస్తున్నట్టు వుంది.ఒకే పుస్తకంలో నాలుగు విభిన్నమైన రచనలు అందించిన కినిగెకు ధన్యవాదాలు.

నాలుగు డిఫరెంట్ సబ్జక్ట్స్ తో ఒకే పుస్తకంలో నాలుగు నవలలు అందించడం చాలా బావుంది.అండర్ వరల్డ్ నవల చదువుటఁటే ఒక ఆక్షన్ థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టు వుంది .
పైసా వసూల్ కొత్త కాన్సెప్ట్.కుబేరుడు అప్పు ఇవ్వడం,వడ్డీ ఇవ్వని వైభవ్ ను కారుతో సహా తన లోకానికి తీసుకువెళ్లడం థ్రిల్లింగ్ గా వుంది.దేవుడిని నమ్మని హీరో దేవుడిని నమ్మడానికి చెప్పే రీజనింగ్ కన్విన్సింగ్ గావుంది.
టార్గెట్ నవల క్రైమ్ వెబ్ సిరీస్ చూస్తున్నట్టు వుంది.
మీ ఇష్టంలో దేవుడితో రచయితా సంభాషణ అర్థవంతంగా మనసును కట్టిపడేస్తుంది.
మిక్స్ డ్ ఎమోషన్స్ తో అద్భుతమైన కాంబినేషన్ విజయార్కె " నాలుగు నవలలు",

ఒకేసారి నాలుగు రచనలు చదువుకునే అవకాశం.పైసా వసూల్ ప్లజంట్ గా వుంది.హాస్యచిత్రం చూస్తున్నట్టు వుంది.మొదటిసారి కుబేరుడి బ్యాక్ డ్రాప్ తో నవల చదువుతున్నాను.కుబేరుడు అప్పు ఇవ్వడం వడ్డీకట్టలేదని భూలోకం నుంచి కారుతో సహా పైకి తీసుకువెళ్లడం బావుంది.అద్భుతమైన కామెడీ నవల.ఆలోచింపజేసే సబ్జెక్టు,
అండర్ వరల్డ్ మాఫియా బ్యాక్ డ్రాప్ తో రాసినతీరు.యాంటీ మాఫియా స్క్వాడ్ ఆలోచన క్రైమ్ థ్రిల్లర్ ని గుర్తుకు తెచ్చింది.అమితాబ్ లాంటి నటుడికి సూటబుల్ సబ్జెక్టు.
టార్గెట్ 789 ఇంట్రస్టింగ్ నవల.డ్రగ్స్ సమస్య ఇప్పటికీ వుంది.
మీ ఇష్టం అందరినీ ఇష్టంగా చదివిస్తుంది.ముఖ్యంగా దేవుడికి రచయితకు మధ్య జరిగిన సంభాషణ ఆసక్తికరంగా వుంది.

డిఫరెంట్ సబ్జక్ట్స్ తో డిఫరెంట్ ఎమోషన్స్.అండర్ వరల్డ్ , పైసా వసూల్ ,రెండు విభిన్నమైన నవలలు.వైభవ్ పాత్ర చాలా బావుంది.మీ ఇష్టం పుస్తకం జీవితానికి దగ్గరగా వుంది.ఒక్కసారైనా తప్పక చదువాలని అనిపించే నాలుగురచనల అద్భుతం .విజయార్కె నాలుగు నవలలు.థాంక్యూ కినిగె.

విజయార్కె నాలుగు నవలల్లో " అండర్ వరల్డ్" ది బెస్ట్ నవల.ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్టు వుంది.
కుబేరాయనమః ప్రారంభంలోనే వేలసంవత్సరాల క్రితం శ్రీ వేంకటేశ్వరస్వామి తన్న కల్యాణానికి అప్పు చేయడంతో మొదలుపెట్టి,వైభవ్ కుబేరుడిని అప్పు అడగడం తథాస్తు దేవతలు రికమెండ్ చేయడం,వడ్డీ చెల్లించని హీరో వైభవ్ ను కారుతో సహా తన లోకానికి తీసుకువెళ్లడం,కారు ఆకాశంలో ప్రయాణం చేయడం రచయిత కల్పనాశక్తికి హేట్సాప్
నవ్విస్తూ ఒక ఆహ్లాదభరితంగా కామెడీ సినిమా చూస్తున్నట్టు వుంది.
మీ ఇష్టం పుస్తకం అందరి జీవితాలను కనెక్ట్ చేస్తుంది.
ఒకే పుస్తకంలో నాలుగు నవలలు ఒక మంచి ప్రయోగం.

ఆహ్లాదాన్ని ఉత్కంఠని కలిగించే నవలలు.మీ ఇష్టం ప్రతీఒక్కరు తమని తాము స్కాన్ చేసుకునే పుస్తకం.ముఖ్యంగా దేవుడితో రచయితా సంభాషణ కళ్ళకు కట్టినట్టు వుంది.

నాలుగు నవలలు ఒకేసారి చదివే అవకాశం కలిగించిన కినిగెకు ధన్యవాదాలు .అండర్ వరల్డ్ నవల చాలా బావుంది.యాంటీ మాఫియా స్క్వాడ్ అన్నది కొత్త థాట్.పైగా ఒక గాడ్ ఫాదర్ ను ఆ స్క్వాడ్ కు చీఫ్ గా వేయడం కొత్త ఆలోచన.ఒక సినిమా చూస్తున్నట్టు వుంది.పైసా వసూల్ సబ్జెక్టు లాంటి సబ్జెక్టు ఇప్పటి వరకూ రాలేదు.మీ ఇష్టం కొత్తతరహా వ్యక్తిత్వ వికాస రచన.టార్గెట్ నవల సూపర్బ్.

నాలుగు విభిన్నమైన కథాంశాలతో నవలలు ఒకే బంచ్ లో,కలిపి ఇవ్వడం బావుంది.ఒకేసారి నాలుగు నవలలు చదువుకునే అవకాశం.మీ ఇష్టం వ్యక్తిత్వ వికాసంలో కొత్త కోణాలను చూపించింది.ముఖ్యంగా దేవుడికి రచయితకు మధ్య జరిగే సంభాషణ.అండర్ వరల్డ్ ఒక మాఫియా సినిమా చూస్తున్నట్టు వుంది.
ముఖ్యంగా ఒక అండర్ వరల్డ్ డాన్ ను యాంటీ టెర్రరిజం స్క్వాడ్ కు చీఫ్ గా చేయడం అనే ఆలోచన కొత్తగా వుంది.చాలా బావుంది.

నాలుగు నవలలు నాలుగు విభిన్నమైన ఎమోషన్స్ ని అందించాయి.ఉత్కంఠ ఆలోచన ఆహ్లాదం అన్నింటికీ మించి అద్భుతమైన ఫీలింగ్ .ఒకే పుస్తకంలో నాలుగు నవలలు ఇవ్వడం వల్ల ఒకేసారి చదువుకునే వీలు కలిగింది. నవలలు చదువుతుంటే కళ్ళెదురుగా దృశ్యాలు కనిపిస్తున్నాయి.పాత్రలు మనతో మాట్లాడుతున్నట్టే వుంది.

నాలుగు నవలలు విభిన్నంగా వున్నాయి.పైసా వసూల్ నవలలో కొత్తదనం వుంది.కుబేరుడి మీద ఒక నవల రావడం,హీరోని వడ్డీ కట్టలేదని తన లోకానికి కారుతో సహా తీసుకువెళ్లడం కాన్సెప్ట్ చాలా బావుంది.చక్కని కామెడీ సినిమా చూస్తున్నట్టు వుంది.అండర్ వరల్డ్,టార్గెట్ నవలలు క్రైమ్ యాక్షన్ తో ఇంట్రస్టింగ్ గా వున్నాయి.
మీ ఇష్టం చక్కని వ్యక్తిత్వ వికాస పుస్తకం.

" మీ ఇష్టం " లో మనమెలా ఉండాలో చెబుతుంది.మన ఇష్టాలను స్కాన్ చేస్తుంది.అండర్ వరల్డ్ మాఫియా ప్రపంచాన్ని కళ్ళకు కడుతూ ఎమోషన్స్ ను అక్షరాల్లో ట్రాన్స్మిట్ చేస్తుంది.
పైసా వసూల్ కొత్త సబ్జెక్టు.కుబేరుడు అప్పు ఇవ్వడం,అప్పు వసూలు చేసుకోవడానికి హీరోను సరాసరి కారుతో సహా తన లోకానికి రప్పించుకోవడం ,నవ్విస్తూ ఆహ్లాదాన్ని అందిస్తుంది.
వుడిని నమ్మని హీరో దేవుడికి మొక్కుకోవడంలోని లాజిక్ ఒక మ్యాజిక్ .
టార్గెట్ డ్రగ్స్ మాఫియా విశ్వరూపాన్ని చూపిస్తూ సెంటిమెంట్ ను,పండించింది.
ఈ నవలలు ( మీ ఇష్టం మినహా ) దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితమే ప్రముఖ పత్రికల్లో వచ్చినా ఇప్పటికీ చదివిస్తూనే వున్నాయి.