• Vignana Vinodini
    • fb
    • Share on Google+
    • Pin it!
  • విజ్ఞాన? వినోదిని

    Vignana Vinodini

    Pages: 155
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

చాలామంది ‘లెక్కలన్నీ చిక్కులే’ అని చిరాకు పడతారు. ’ఆల్జీబ్రా – గుండె గాభరా’ అని భయపడతారు. ’అమ్మో లెక్కలే!!’ అని ఆందోళనపడతారు. అవన్నీ అపోహలేనని రుజువు చేసి, లెక్కలపట్ల లెక్కలేనంత ప్రేమను పెంచి, లెక్కల్లోని చిట్కాలను, సరదాలను అందరికీ పంచటానికి జోషి విశ్వనాథం నడుం బిగించి గొప్ప ప్రయత్నం చేశారు.

ఇది ఆషామాషీ వ్యవహారం కాదు. మన మీదకి విరుచుకుపడుతున్న వీరప్పన్ ని వీర హనుమాన్ గా మార్చి, మనకి ధైర్యాన్నిచ్చే శక్తిగా లెక్కల్ని మార్చే యుక్తిని ఈ పుస్తక రూపంలో ఒక వరంలా అందించారు.

లెక్కల గమ్మత్తులు గుత్తులు గుత్తులుగా కాసిన వృక్షం మన పెరట్లో ఉన్నట్లే లెక్క ”కోసుకున్న వారికి కోసుకున్నంత”. ”నూటొక్క తమాషాల” పేరిట పేకముక్కల మేజిక్ ల పుస్తకం రాసిన, మెజీషియన్ గా లెక్కకు మించిన అనుభవం సంపాదించిన జోషి విశ్వనాథం మనకి అందించిన లెక్కల వేదం ఇది. మెదడుకి పదును. మనసుకి ఆహ్లాదం. జ్ఞానానికి మరింత జోడింపు.

ఇక అంకెలతో ఆడుకోండి. ఈ సరదాల పుస్తకాన్ని వాడుకోండి.

- చొక్కాపు వెంకటరమణ