-
-
విదురనీతి
Viduraneeti
Author: Avancha Satyanarayana
Publisher: Victory Publishers
Pages: 124Language: Telugu
మహాభారతం మానవుడి జీవితాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకుని విశ్లేషించిన గ్రంథం. అందుకనే ఇప్పటివరకూ వచ్చిన ఏ సాహిత్య గ్రంథం, నీతి గ్రంథమూ మహాభారతానికి సాటిరావు.
తాను పాండవులతో సంధి చేసుకొనవలయునో లేక యుద్ధానికి సిద్ధపడి కురుక్షేత్ర మహా సంగ్రామానికి కారణభూతుడు కావలెనా? అని సందిగ్ధంలో ఉన్న సమయంలో కురు చక్రవర్తి ధృతరాష్ట్రునికి, ఆతనికి ఒక విధముగా సవతి తమ్ముడైన విదురుడు బోధించిన నీతియే విదురనీతి అని ప్రసిద్ధి చెందింది.
ఈ విదురనీతి మహాభారతంలోని ఐదవదైన ఉద్యోగపర్వంలో, ముప్ఫై మూడవ అధ్యాయం నుంచి నలభైయవ అధ్యాయం వరకు అంటే ఎనిమిది అధ్యాయాలలో విస్తరింపబడింది. ఈ ఎనిమిది అధ్యాయాలలోనూ ఒక మనుష్యుడు మనుష్యునిగా రాణించి ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థాల సాధన కోసం అనుసరించవలసిన నీతి విషయాలన్నీ సంపూర్తిగా వివరించబడ్డాయి.
రాజనీతిని గురించిన అనేక విషయాలతో కూడిన విదుర, ధృతరాష్ట్ర సంవాదమైన విదురనీతి ఒక రకంగా చాణక్య నీతికి ఇంకా అసంఖ్యాక నీతిగ్రంథాలకు ఆధారప్రాయ రచన అని భావించవచ్చు.
విదురుడు సత్యానికి విధేయతకు పక్షపాతరహిత విధానాలకు దూతగా ధర్మప్రతినిధిగా భావించవచ్చు. విదురుడు మహాభారతం యొక్క ఆంతరిక భావాత్మకతకు ప్రతినిధి.

- ₹60
- ₹60
- ₹60
- ₹648
- ₹1080
- ₹324