-
-
విదుర్ నీతి
Vidur Neethi
Author: Suryadevara Rammohana Rao
Publisher: Madhu Priya Publications
Pages: 330Language: Telugu
డైమండ్ అపార్ట్మెంట్స్ పోర్టికోలో ఇది ఒక చర్చనీయాంశం అయిపోయింది. ఆపద్బాంధవుడిలా వచ్చి ఆపదలోని అబలను కాపాడాడు.
గూండల్ని తరిమేశాడు. కాని కన్నుమూసి తెరిచేలోపు అతని జాడలేదు. హెల్మెట్ పెట్టుకున్నాడు. ఎవరతను! ఎందు కొచ్చాడు? ఎలా వచ్చాడు?
ఏదీ తెలీక విచిత్రంగా చెప్పుకోనారంభించారు అక్కడివాళ్ళు. ఈ లోపల-
''అదంతా నీకు అవసరమా? మనకెందుకు వాళ్ళతో గొడవ?'' వెనక కూచున్నమాన్విత విదుర్ మీద కోప్పడింది.
''నిన్నుకూడ ఎవరన్నా అల్లరిచేస్తుంటే చూస్తూ వూరుకోమంటావా? నావల్ల కాదు. నువ్వు నా వెనక కూచోడం నువ్వు తెలిసినవాళ్ళు చూస్తే అనుమానిస్తారు. చున్నీతో ముఖం కప్పుకో'' హెచ్చరించాడు.
వెంటనే కళ్ళు మాత్రం కన్పించేలా వుంచి చున్నీతో ముఖాన్ని కవర్ చేసుకుంది మాన్విత.
''నా ఉద్దేశం అదికాదు. నువ్వే సమస్యల్లో ఉన్నావ్. మధ్యలో ఈ పరోపకారాలు మంచిది కాదని...''
''ఇదే... ఎవరికి వాళ్ళు ఇలా ఆలోచించబట్టే అక్రమార్కుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. న్యాయ ధర్మాలకు చోటు లేకుండా పోతోంది. ఎక్కడ చూసినా అవినీతి కంపుకొడుతోంది. అంతా మనం నిర్మూలించలేకపోవచ్చు. చూస్తూ చూస్తూ నిస్సహాయులకు సాయంచేయలేకపోతే మనం మనుషులమే కాదు'' అన్నాడు.
నేటి సమాజం లో ఎం జరుగుతుందో.. దాన్ని ఎలా సా
సరిదిధ్ధాలో అలంటి కదా.. అందమైన కల