-
-
విదేశీ కోడలు
Videsee Kodalu
Author: Kosuri Uma Bharathi
Publisher: Vanguri Foundation of America
Pages: 132Language: Telugu
ఉమాగారి కథలు చాలామటుకు అమ్మ, నాన్న, పిల్లలు - వీళ్ళ మధ్యలో పరిభ్రమిస్తూంటాయి. ముఖ్యంగా అమ్మా నాన్నలకు పిల్లల వల్ల జరిగే అన్యాయం ఉమాగారిని కదిలించింది అనుకుంటాను ఆమె జీవితంలో. మనందరం కూడ మన సభ్య సమాజంలో చూస్తుంటాం ఈ కథలలోని సన్నివేశాల్ని. అయితే మనం కూడ ఎంతవరకు మన అమ్మలకు, నాన్నలకు ఖేదం కలిగించామో ఒకింతసేపు ఆలోచిస్తేనే కాని మనకు తెలియదు. ఈ కథలు మనల్ని తట్టి లేపి ఆలోచింపచేస్తాయి. ఇంకోటి, ఆమె తనకు నాట్యం మీద వున్న మక్కువను కూడా అతి సున్నితంగా రెండు రచనలలో వచన రూపంలోనూ, పద్యరూపంలోనూ చెప్పారు. కొన్ని కథలలో ఆమె ఒక మనిషి మొత్తం జీవితాన్ని కుదించి రాయడం జరిగింది. ఇది నిజంగా చాలా కష్టమైన పనే! - అదీ నాలుగు పేజీలలో కుదించడం. అన్ని కథలలోనూ ఒక మెసేజ్ పాఠకులకు ఇవ్వాలనే తపన కొట్టొచ్చినట్లు కనబడుతుంది.
ఒక రచయిత్రిగా అందరి హృదయాలను తాకగలిగే కథావస్తువులను తన జీవితపు అనుభవాల పరంపరలోంచి ఎన్నుకుంటూ, తనదంటూ ఒక శైలిని ఏర్పరచుకుంటూ, వైవిధ్యం కలిగిన రచనలను చేస్తూ, తెలుగు సాహిత్యానికి 'నేను సైతం' అంటూ తన మార్కు 'సమిధ'ను ఆహుతినిస్తూ, ఇంకా ఇంకా తన రచనలను సానబడుతూ, ముందు ముందు మరిన్ని మంచి మంచి రచనలను తెలుగు పాఠకులకు ఉమాభారతి గారు అందివ్వగలరని ఆశిస్తున్నాను.
- శాయి రాచకొండ
