-
-
విదేశ గమనే
Videsa Gamane
Author: Tadikonda K. Sivakumara Sarma
Publisher: Ajo Vibho Kandalam Foundation
Pages: 211Language: Telugu
"అమెరికాలోని తెలుగు రచయితల్లో ఒక ప్రత్యేక శైలిలో కథలు వ్రాస్తున్న శివకుమార్ గారి కథల సంపుటి ఇది. ఎంచుకునే ఇతివృత్తంలో కానీ, కథని చెప్పే శైలిలో కాని వీరి ప్రత్యేకత స్పష్టంగా తెలుస్తుంది. రెండు మూడు కథలు చదివితే వారి కథ ఎప్పుడు ఎక్కడ చదివినా గుర్తుపట్టవచ్ఛు. ఇంతగా సొంత సంతకాన్ని స్థిరపరచుకున్న కథా రచయితలు అరుదుగా కనిపిస్తారు. ఒకే శైలికి పరిమితం కాక, కథని బట్టి శైలిని మలచుకుంటూ వెళ్లడంలో కూడా ఈ రచయిత ఎంతో నేర్పు చూపించారు. సీరియస్ కథాంశాన్ని ఎంత గాఢంగా ఆలోచనలు రేకెత్తించేలా, హృదయాన్ని కదిలించేలా చెబుతారో - నవ్వులని పండించాల్సి వచ్చినప్పుడు అంతే సులువుగా భాషని సరళీకరణ చేస్తారు. ఇందులో ప్రతి కథా ఆలోచింప చేస్తోంది. అలవోకగా మరిచిపోయే కథలు కావివి. పాఠకుడిని ఏకాగ్రతతో చదివింప చేసి మనసుతో మాట్లాడతాయి. ... "
- - కౌముది.నెట్ లో కిరణ్ ప్రభ గారి సమీక్ష నుండి
