-
-
విచిత్ర కాశీరామేశ్వర మజిలీ కథలు
Vichitra Kasi Rameswara Majili Kathalu
Author: Kandepu Sudhakar
Publisher: S.R. Book Links
Pages: 176Language: Telugu
పూర్వం కన్నడ రాజ్యంలో ఒక అగ్రహారంలో గుణాకరుడు అనే బాలుడు ఉండేవాడు. దురదృష్టవశాత్తు చిన్నతనంలోనే అతని తల్లిదండ్రులు చనిపోతారు. అనాధ అయిన ఆ బాలుడిని, అగ్రహారంలోని వారు ఆదరాభిమానాలతో పెంచారు. వారి అభిమానంతో గుణాకరుడు ఒక గురువు వద్ద ఉంటూ విద్యాబుద్ధులు నేర్చుకుంటాడు. గురువు దగ్గరే పెరిగి పెద్దవాడై ఆయనకు సేవలు చేస్తాడు.
ఒక రోజు గుణాకరుడు, గురువుగారి ఆదేశం ప్రకారం పట్నానికి వెళ్తాడు. ఆ సమయంలోనే సముద్రం పొంగి, సముద్ర తీరాన ఉన్న ఆ అగ్రహారం మునిగిపోతుంది. తనకు కావలసిన ఎందరో ఆత్మీయులూ అలాగే తన గురువు కూడా చనిపోవడంతో పిచ్చివాడవుతాడు.
గుణాకరుడు అగ్రహారాన్ని వదిలి ఊరూరు తిరుగుతాడు. అలా తిరుగుతుండగా తిరుపతి వెళుతున్న ఒక గుంపును చూసి వారితో పాటు తిరుపతికి వెళ్తాడు. ఆ క్షేత్రంలోని విశేషాలను చూస్తూ తిరుగుతున్న గుణాకరునికి ఒక గుహలో యోగి కూర్చుని ధ్యానం చేస్తుండగా కనిపిస్తాడు. కొందరు భక్తుల ద్వారా ఆ యోగిని గురించి తెలుసుకొని అతని పాదాల దగ్గరే తన జీవితాన్ని గడపాలని గుణాకరుడు అనుకుంటాడు.
భక్తులందరు గుహను విడిచి వెళ్ళిపోయినా, గుణాకరుడు మాత్రం భక్తితో యోగానందుడికి నమస్కరిస్తు అలా గుహలోనే ఉండిపోతాడు. గుణాకరుడిని చూసి ఆశ్చర్యపోయి యోగానందుడు తనను పలకరిస్తాడు. గుణాకరుడు ఎంతో సంతోషించి జీవితాంతం తనకు ఆయన పాదాల చెంత చోటు ఇవ్వమని ప్రార్ధిస్తాడు. గుణాకరుడి కోరిక ప్రకారము తనతో కూడా ఉండటానికి యోగి ఒప్పుకుంటాడు.
‘ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి కాశీ వెళ్ళి, అక్కడి నుండి రామేశ్వరం వెళ్ళి, తిరిగి ఇక్కడికే వస్తాను. అదే క్రమంలో నేను తీర్ధయాత్రలకు వెళ్తున్నాను నువ్వు కూడా నాతో పాటు రా’ అని యోగి అనగానే సంతోషంగా ఒప్పుకుంటాడు గుణాకరుడు.
గుణాకరుడు గ్రామంలోకి వెళ్ళి తీర్థయాత్రలకు కావలసినవన్ని తీసుకొని వస్తాడు. ఇరువురు భోజనం చేసి విశ్రాంతి తిసుకుంటారు.
గుణాకరుడు యోగానందుని పాదములు నొక్కుతూ “స్వామీ! నేను సరుకుల కోసం గ్రామంలోకి వెళ్ళినపుడు అక్కడ నాలుగు రోడ్ల కూడలిలో ఒక విగ్రహం ఉంది. రెండు రాతి స్తంభాలపైన ఒక రాతి దూలం ఉంది. దానికి గొలుసులతో ఒక మానవ విగ్రహం తలక్రిందులుగా వేలాడదీసి ఉంది. ఆ విగ్రహం గురించి ఈ గ్రామ ప్రజలను అడిగితే ఏమీ తెలియదు అని చెప్పారు. మీరు మీ జ్ఞాన దృష్టితో చూసి, ఆ విగ్రహం గురించి తెలపండి.” అని అడుగుతాడు.
యోగానందుడు దివ్యదృష్టితో విగ్రహం చరిత్రను తెలుసుకొని, గుణాకరునికి చెప్పసాగిన కథలే ఈ విచిత్ర కాశీరామేశ్వర మజిలీ కథలు.
గమనిక: " విచిత్ర కాశీరామేశ్వర మజిలీ కథలు " ఈబుక్ సైజు 14.8mb

- ₹78
- ₹243.6
- ₹174.96
- ₹480
- ₹495.6
- ₹135.6