-
-
వెయ్యేళ్ళ చరిత్ర
Veyyella Charitra
Author: Telakapalli Ravi
Pages: 162Language: Telugu
ప్రతి దేశానికి చరిత్ర ఉంటుంది. అవన్నీ కలిస్తే ప్రపంచ చరిత్ర అవుతుంది. దేశాలు ఇంత స్పష్టంగా ఏర్పడక ముందుకూడా మనిషికి చరిత్ర ఉంది. మనిషి పుట్టి పది లక్షల ఏళ్ళయిందని ఒక అంచనా. ఇందులో చాలా కాలం చరిత్రకు అందని దశకూడా ఉంది. ఆదిమ సమాజ దశ అది. అప్పుడు భూమి మీద నగరాలు లేవు. గ్రామాలు లేవు. పొలాలు లేవు. చరిత్ర పూర్వ మానవులు చిన్న చిన్న బృందాలుగా అడవుల్లో సంచరిస్తుండేవారు. వారి చేతుల్లో కర్రలు, రాళ్ళు తప్ప మరేమీ ఉండేవికావు. వస్త్రాలు లేవు. నివాసాలు లేవు. చరిత్ర వీటన్నింటినీ మనకు తెలియచేస్తుంది. ప్రాచీన చరిత్ర ఇందులో మొదటిది. ప్రాచీన ప్రజానీకం ఎంతో కష్టపి పొలాలు దున్నేవారు. దారులు వేశారు. నగరాలు నిర్మించారు. అనేక ఆవిష్కరణలు చేశారు. అవన్నీ కలిస్తే అభివృద్ధి సాధ్యమైంది. ఉదాహరణకు పుస్తకాలే తీసుకోండి. చైనావారు కాగితం కనిపెట్టారు. గ్రీకులు అక్షరాలు కనిపెట్టారు. భారతీయులు 1 నుంచి 10వరకు అంకెలు కనిపెట్టారు. ఇటలీలో తొలిసారి పుస్తకాలు బైండింగు చేశారు. దాదాపు ఆరువేల ఏళ్ళక్రితం వివిధ దేశాలలో ప్రజలు అక్షరాలు నేర్చుకుని, రాయడం మొదలుపెట్టారు. ఆనాటి రాతప్రతులు కొన్ని ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఇంకా అంతకు ముందు కాలంలో రాతలేదు. అయితే వారు ఉపయోగించిన వస్తువుల అవశేషాలు దొరుకుతాయి.చరిత్ర పఠనంతో మనకు ఆనాటి రాజ్యాలు, రాజులు, శాస్త్రజ్ఞులు, కళాకారుల గురించి, మరెన్నో అంశాల గురించి తెలుస్తుంది. అయితే అంత మాత్రంతోనే చరిత్ర పూర్తి కాదు.
- తెలకపల్లి రవి
* * *
వెయ్యేళ్ళ చరిత్రను రాయాలనుకోవడమే సాహసం. అందులోనూ క్లుప్తంగా సామాన్య పాఠకులకు కావాల్సిన రీతిలో రచించడం మరీ కష్టం. చక్కగా, సమర్థవంతంగా, సులభ శైలిలో పాఠకులను చదివింపచేసేట్లుగా ఆసక్తికరంగా సాగింది ఈ రచన.
- ప్రచురణ కర్తలు
