విల్పర్నంతా కూడగట్టుకుని, తను విసరబోతున్నరాయిని మధ్యలోనే ఆపాడు వెట్టి. బిగపట్టి ఉంచిన ఊపిరిని కూడా తేలికగా బయటికి వదిలేశాడు.
"నీకు ఒళ్లు బలిసిందిరా, ఎప్పుడుపడితే అప్పుడు ఫోన్లు చేయడం ఎక్కువైపోయింది" అంటున్నాడు షెడ్ కి కొంచెం అవతలికి పోయిన పఠాన్. అవతలి పక్కనుంచి ఎటువంటి మాటలు వినబడ్డాయో తెలియదు గాని, "అలాగా... అయితే సరే, నేను వెంటనే వచ్చేస్తాను. పదిగంటలయ్యేసరికి అక్కడ ఉంటాను" అంటూ ఫోన్ ఆఫ్చేసి ప్యాంటు జేబులో పెట్టుకుని, మళ్ళీ షెడ్లోకి వచ్చాడు.
ప్రశ్నార్థకంగా చూశారు షెడ్లో ఉన్నవాళ్ళందరూ.
"చింతలపల్లి నుంచి చేశాడు నాగులు. అక్కడ మనవాళ్లు చేస్తున్నపని గురించి ఫారెస్టు డిపార్ట్మెంట్ వాళ్ళకి అనుమానం వచ్చిందిట. నన్ను వెంటనే రమ్మని అంటున్నాడు” లోపల పెట్టుకున్న ఫోన్ తడుముకుంటూ చెప్పాడు అతను.
"వెంటనే రమ్మంటున్నాడా? అయితే మీరు వెళుతున్నారా?" అడిగాడు బసవప్ప.
"వెళ్ళాలి కదా బసవప్ప. ఒకటి కాదు రెండు కాదు. పదికోట్లకి సంబంధించిన పని. తేడావస్తే మా నాన్న నా తెలివిని తిట్టిపోస్తాడు" నుదురు రుద్దుకుంటూ చెప్పాడు పఠాన్.
"మరి ఇక్కడి పని? దాన్ని కూడా మీ నాన్నగారే నాకు అప్పచెప్పారు. ఇక్కడ తేడా వచ్చినా తప్పవు కదా తిట్లు?" అడిగాడు బసవప్ప.
"నువ్వు ఉన్నావు కదా బసవప్పా! ఆడిని మా వాళ్లు నీకు చూపిస్తారు. నువ్వు ఏం చెపితే అది చేసేస్తారు. అదీకాక...” అంటూ మాటని ఆపాడు పఠాన్.
Pls enable rent option for this book.