-
-
వేట మొదలైంది
Veta Modalaindi
Author: Adapa Chiranjeevi
Publisher: Venkata Ramanamma Granthamala
Pages: 190Language: Telugu
‘‘ఈ రీజియన్‌లో ఇటువంటి క్రూర మృగాలు ఉన్నట్టు నేను ఏ జాగ్రఫీలోనూ చదవలేదు’’ పరుగు వేగం ఏమాత్రం తగ్గించకుండా అన్నాడు జార్జి.
‘‘ఈ రీజియన్‌లోనే కాదు.. అసలు అమెజాన్ నదీ పరివాహక ప్రాంతాలలో క్రూరమృగాలు ఉండటానికి అవకాశం లేదు. దట్టమైన కీకారణ్యం ` క్రూరమృగాలు సంచరించడానికి, జీవించడానికి అనువుగా ఉండని కారణంగా ఇవి ఉండటం అరుదు. అధిక ఉష్టోగ్రత, అధిక వర్షపాతం వల్ల సాధుజంతువుల సంఖ్య కూడ తక్కువ వుంటుంది. అలాంటప్పుడు తొమ్మిది అడుగుల ఎత్తున్న ఈ మృగం ఎక్కడనుంచి ఎలా వచ్చిందో అర్థం కాకుండా వుంది!’’ దక్షిణ అమెరికా జాగ్రఫీ తెలిసిన మధుబాబు చెప్పాడు.
మిగతా ఐదుగురూ ఆయాసంతో వగరుస్తున్నారు.
వంద గజాల దూరంలో ఆ క్రూరమృగం కనిపించేసరికి వాళ్ళందరూ సడెన్‌గా ఆగిపోయారు.
మధుబాబు చుట్టూ చూశాడు.
నాలుగడుగుల దూరంలో బిలమార్గం చిన్నగా వున్న ఆ కొండగుహ కనిపించింది. వాళ్లను హెచ్చరించి ఆ గుహలలోకి దూరాడు అతడు.
ప్రాణభయంతో జాస్మిన్ వెనుకగా మిగతావాళ్లూ ఆ బిలంలోకి ఎలుకల్లా దూరిపోయారు.
వాళ్ళ వెనుకగా ఆ బిలంలోకి తలదూర్చింది ఆ క్రూరమృగం. దాని భీకర రూపాన్ని చూసి నిమ్మీ, జాస్మిన్ కెవ్వున అరిచారు.
ఆ మృగం తల వెనక్కి తీసుకుని, పొడవైన చెయ్యిని బిలంలోకి దూర్చింది.
అందరూ వెనక్కి జరిగి పక్కపక్కను నిలబడి రాతిగోడకు అతుక్కు పోయినట్టు కదలక మెదలక అలాగే వుండిపోయారు.
ఎవరో ఒకరు దొరక్కపోతారా అని చెయ్యి మొత్తం బిలంలోకి దూర్చిందా రాక్షస మృగం.
అప్పుడేం జరిగింది?
ఊపిరి సలపనివ్వని సస్పెన్స్‌తో, కళ్లను అక్షరాల వెంట వాయివేగ మనోవేగాలతో పరుగులు తీయించే థ్రిల్లర్!
అడపా చిరంజీవి రచించిన హారర్ & అడ్వెంచరస్ థ్రిల్లర్
"వేట మొదలైంది".
అడపా చిరంజీవి గారి అద్భుతమైన తనదైన శైలితో చదువరులను మెస్మరైజ్ చేసే " వేట మొదలైంది" నవల అమెజాన్ ప్రపంచంలోకి తీసుకువెళ్ళింది.నవల టేకాఫ్ ,నవల ప్రారంభంలో రాసిన జంబోజెట్ 737 విమానంలా దూసుకువెళ్లింది .ఒక అపరాధపరిశోధన నవలలో వుండే సస్పెన్స్ ఉత్కంఠ వేగం ఈ నవలలో పుష్కలంగా వున్నాయి.ప్రతీపాత్ర ఒక ఐడెంటిటీని కలిగివుంది.ఒక కొత్తప్రపంచాన్ని పాఠకులకు పరిచయాన్ని చేసిన " ది బెస్ట్" నవల" వేట మొదలైంది "
ఇందులో వచ్చిన అడపా చిరంజీవి గారి అన్ని నవలలూ చదివాను.. ఈయన నవలలు చదువుతుంటే కథలో క్యారెక్టర్స్ , ఆ యాబియన్స్ మన కళ్ళ ముందు వున్న ఫీలింగ్ కల్గుతుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన "వేట మొదలైంది".హారర్
కినిగే లో వచ్చిన అడపా చిరంజీవి గారి అన్ని నవలలూ చదివాను.. ఈయన నవలలు చదువుతుంటే కథలో క్యారెక్టర్స్ , ఆ యాబియన్స్ మన కళ్ళ ముందు కదులుతున్న ఫీలింగ్ కల్గుతుంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన హారర్
Chiranjeevi's novels are wonderful experiences. The story feels like an accidental real life experience