-
-
Verb And Its Conjugation
Verb And Its Conjugation
Author: Nagavalli Siva
Publisher: Victory Publishers
Pages: 179Language: Telugu. English
ఏ భాషలోనైనా, క్రియ (Verb), అనేది అత్యంత ప్రముఖమైనది. Verb అనేది వాక్యానికి ప్రాణం వంటిది. Verb లేనిదే వాక్యం ఏర్పడదు. అంతటి ప్రాధాన్యతగల Verb గురించి తెలుసుకోవడం మరియు క్షుణ్ణంగా అధ్యయనం చేయడం అత్యంత ఆవశ్యకం.
Verb అంటే ఏమిటి?
Verb ఎన్ని స్థితులలో ఉంటుంది?
Conjugation అంటే ఏమిటి?
7 రకాల Verb forms ఎలా వ్రాయాలి?
ప్రతీ Verbకూ అర్థం ఏమిటి?
ప్రతి Verbకూ Conjugation ఎలా ఉంటుంది?
Verbsను sentencesలో ఎలా ఉపయోగించాలి?
ఈ రకమైన అనేక సందేహాలను తీర్చుకోవడం ద్వారా Verbను గురించి స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఈ విధంగా తెలుసుకోవడం వలన ఇంగ్లీషు భాషను మాట్లాడేటప్పుడు భాషను అనర్గళంగా మరియు హుందాగా మాట్లాడగలరు. ఈ పుస్తకంలో ఒకే అర్థాన్నిచ్చే అనేక Verbsను కూడ ఇవ్వడం జరిగింది. దీనివలన పదేపదే ఒకే Verbను ఉపయోగించకుండా భాషను చక్కగా మాట్లాడవచ్చు. మనం నిత్య జీవితంలో ఉపయోగించే అన్ని క్రియలకు ఇంగ్లీషులో అర్థాలను, వాటియొక్క Conjugationను ఈ పుస్తకంలో అందించడం జరిగింది.
ఈ పుస్తకం మీకు Verb పట్ల కలిగే అన్నిరకాల సందేహాలకూ సమాధానం చెప్పగలదు. కావున మీరు ఈ పుస్తకం చదివి Spoken Englishలో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్న Verbను గూర్చి విపులంగా అవగాహన చేసుకొని అనర్గళమైన ఆంగ్లభాషను మాట్లాడగలరని ఆశిస్తూ.....
- రచయిత
