• Venutiragani Vennela
  • Ebook Hide Help
    ₹ 270
    300
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వెనుతిరగని వెన్నెల

    Venutiragani Vennela

    Author:

    Pages: 464
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

జివితంలో అత్యంత ఆసక్తికరమైంది, అత్యంత ఆశ్చర్యకరమైంది, అత్యంత అద్భుతమైంది, అత్యంత అనూహ్యమైంది జీవితమే! జీవితానికి నిర్వచనాలు, ఉపమానాలు ఎన్నైనా చెప్పుకోవచ్చు కానీ విభిన్న జీవనవిధానాల విషయానికి వస్తే, ఒక్కో జీవితం ఒక్కో సవాల్. జీవితం అంటే ఇలా ఉంటుంది, జీవితమంటే ఇలా ఉండాలి, అందమైన జీవితానికి ఆహ్లాదకరమైన సూత్రాలు... ఇలాంటివి అధ్యయనం కోసం, విశ్లేషణ కోసం ఉపయోగపడతాయేమో కానీ, వాస్తవంలో ఎవరి సమస్యలు వారివే, ఎవరి ప్రశ్నలు వారివే, ఎవరి జవాబులు వారివే. చాలాసార్లు నమ్మకం పునాదుల మీద అనేక జీవితబంధాల నిర్మాణం ప్రారంభమౌతుంది. నమ్మకాలు నమ్మెనపుడు, పునాదులు కదిలినప్పుడు జీవితబంధాలకు అగ్నిపరీక్షలు ఎదురౌతాయి. సరిగ్గా అలాంటి సమయంలోనే మనిషిలోని మనిషి బయటకు వస్తాడు /వస్తుంది. ఆ మనిషిలోని మనిషే జీవితానికి అసలైన నిర్వచనం తెలియచేస్తుంది / చేస్తాడు. ఈ భావాలు స్పష్టంగా ఉన్నాయనిపిస్తే - ఇంక ఈ నవలలోని కథ గురించి వివరంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను.

ఇదొక తన్మయి కథ. భావుకతే జీవితమనుకున్న ఓ యువతి కథ. కానీ అడుగడుగునా అగ్నిగుండాలను ఎదుర్కొన్న అమ్మాయి కథ. ఎక్కడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఎదురైన ప్రతి సవాలునీ స్వీకరించి కాలానికి ఎదురీదిన తన్మయి జీవితానుభవాల సంపుటి ఈ నవల. తన్మయి కథ చదువుతుంటే, ఇది కథలా అనిపించదు, ఓ నిజజీవితాన్ని కళ్ళముందు చూస్తున్నట్లుంటుంది. సిరివెన్నెలగారన్నట్లు 'ఒక్కటంటే ఒక్క లైఫే... ఏడిపించకు దాన్ని' అనిపిస్తుంది. అలా జీవించగలిగితే బావుండుననిపిస్తుంది. కానీ ఉన్న ఒక్క లైఫే ఇదేనా నరకమంటే అనిపిస్తుంటే, కమ్ముకొచ్చిన కారుమబ్బుల్ని తరిమికొట్టే క్రమంలో తానెన్నో పాఠాలు నేర్చుకుని, మనకెన్నో పాఠాలు చెప్పిన 'వెనుతిరగని వెన్నెల' కథ ఇది.

- కిరణ్ ప్రభు

Preview download free pdf of this Telugu book is available at Venutiragani Vennela