• Venunadam
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వేణునాదం

    Venunadam

    Publisher: Nagasuri Digital

    Pages: 240
    Language: Telugu
    Rating
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    5 Star Rating: Recommended
    '5/5' From 1 votes.
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

సైన్స్ రచయితగా, మీడియా అంశాల విశ్లేషకునిగా, ఆకాశవాణి ప్రయోక్తగా తెలిసిన డా. నాగసూరి వేణుగోపాల్ తన అవలోకనా మంజరిని ‘వేణునాదం’ అంటున్నారు. ఇందులో వారి సొంత వూరు, అమ్మా నాన్న, చదువుకున్న స్కూళ్ళు అందలి ఉపాధ్యాయులు , తాము 'ఆకాశవాణి' తరఫున ఉద్యోగం చేసిన పట్టణాలు, నగరాలు గురించి హృద్యంగా చెప్పారు. పెక్కు రంగాలకు చెందిన ప్రముఖులతో తన పరిచయాన్ని, సహచర్యాన్ని నెమరువేసుకుంటూ వ్రాసిన వ్యాసాలు జీవిత యదార్థ గాధల గురించిన మేలు పరిశీలనలు. శ్రీ యుతులు నార్ల వెంకటేశ్వరరావు, హెచ్. నరసింహయ్య, జి.వి.కృష్ణారావు, నండూరి రామమోహనరావు, వి.ఎస్. రమాదేవి, సర్దేశాయి తిరుమలరావు, రావూరి భరద్వాజ, విద్వాన్ విశ్వం, సి. రాఘవాచారి, ఆవంత్స సోమసుందర్, పొత్తూరి వెంకటేశ్వరరావు, కూచిమంచి సత్య సుబ్రహ్మణ్యం, సంజీవదేవ్, పరకాల పట్టాభి రామారావు, ముళ్ళపూడి వెంకటరమణ, బి.వి. నరసింహారావు ఇలా ఎంతోమంది గురించిన విశేషాలు మనసుకు హత్తుకుంటాయి.
మద్రాసు సంగీతోత్సవాలు, భాగవత మేళాలు, ఫిల్టర్ కాఫీ, సాంబార్ ఒక ఎత్తయితే, విశాఖపట్నం వార్ మెమోరియల్ నుంచి తిరుమల వేంకటేశ్వర స్వామి కట్టే పంచె వరకు తెలుగు నగరాల ప్రత్యేకతలు పాఠకుని అలరిస్తాయి. శ్రీ జి. నరసింహారావు వంటి తగిన ప్రాచుర్యం పొందని తెలుగు వర్ణ చిత్రాల కళాకారుల గురించి ప్రస్తావించడం నాగసూరి వేణుగోపాల్ గారి వితరణకు అద్దం పడుతుంది. ఇవి గాక ఆయన మాతృదేవోభవ, అమ్మ చెప్పింది వంటి సినిమాల గురించి ప్రస్తావన మనల్ని సునిశిత పరిశీలన దిశగా అడుగు వేయిస్తుంది.
ఈ ' వేణునాదం' గత 35 సంవత్సరాల మన తెలుగు సంస్కృతి, సంఘం ఇముడ్చుకున్న అనేక పోకడల గీతం. ఆలకిస్తే అలనాటి ఆంధ్ర రాష్ట్ర స్వరూపం దర్శించడం తధ్యం.

- డా. కాళ్ళకూరి శైలజ

గమనిక: "వేణునాదం" ఈబుక్ సైజు 6mb

Preview download free pdf of this Telugu book is available at Venunadam