-
-
వెన్నెల కాటేసింది
Vennela Katesindi
Author: Gollapudi Maruthi Rao
Pages: 100Language: Telugu
నా సాహితీ వ్యాసంగంలో ‘నవల’ ఒక భాగం మాత్రమే కనుక - తరువాతి నా సినిమా వ్యావృత్తి నన్ను దూరంగా తీసుకుపోయింది కనుక - మలిముద్రణలకు ప్రయత్నమయినా చేయలేదు. అసలు ఆ దృష్టే ఈ 30 ఏళ్ళలో నాకు లేకపోయింది. అందుకనే నవల గురించి చాలా మంది ‘మహానుభావులు’ ప్రస్తావించే చాలా సందర్భాలలో కనీసం నా పేరయినా వినిపించదు. విచారం లేదు. అయితే ఈ తరం ఈ నవలని చదవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మారుతీరావుని కేవలం సినీనటుడిగానే ఎరిగిన తరం తోసుకు వస్తోంది. Don't want to die an untimely death – as a writer. అయితే ఇప్పటి తరంలో చాలా మందికి తెలుగు చదవడం రాదేమో. ఇప్పుడు సాహిత్యాన్ని ‘చదువుకుని’ ఆనందించే వారి తరం మైనారిటీ ఏమో! వారికి దాదాపు 38 సంవత్సరాల నాటి సాహిత్యం ‘పాత చింతకాయ పచ్చడి’ లాగ ఉంటుందేమో. అయితే పాత చింతకాయ పచ్చడి రుచి మరిగిన వాళ్ళు కొందరయినా ఉండకపోరు.
ఈ నవల ఇప్పటి తరానికి నచ్చితే - 38 సంవత్సరాలపాటు నేను పాఠకుల్ని నష్టపోయినట్టు లెక్క. నచ్చకపోతే ఇన్నేళ్ళు నా సాహిత్యం మూలన పడడం వల్ల ఈ సమాజానికి ఏమీ అనర్ధం జరగనట్టు లెక్క. ఈ నిర్వేదం ఇప్పటి నా వయస్సుది. ఇలా అంటున్నప్పుడు నా ఆలోచనల పదును తగ్గిందని కాదు. నా ఆలోచనలను అంగీకరించని పాఠకుల అలసత్వాన్ని అంగీకరించే అవగాహన, sense of humour పెరిగిందని. ఇక నవలని చదివే సాహసం చెయ్యండి.
45 సంవత్సరాల క్రితం వ్రాయబడిన ఈ నవల కొద్దికాలం క్రితం కౌముది అంతర్జాల పత్రికలో సీరియల్‌గా వచ్చింది. ఈ పుస్తకాన్ని ఇప్పుడు కినిగెలో ఈ-బుక్‌గా తీసుకురావడానికి సహకరించిన కౌముది సంపాదకులకు కృతజ్ఞతలు.
