-
-
వెన్నెల చివుళ్ళు
Vennela Chivullu
Author: Sunita Gangavarapu
Publisher: Shaili Publications
Pages: 113Language: Telugu
Description
కవిత్వం రాయాలంటే...
కలలు కనాలి అవి ముక్కలవ్వాలి. మళ్ళీ అతుక్కోవాలి.
కష్టాలు తెలియాలి. కన్నీళ్ళు రావాలి. ఒక అసంతృప్తి నీడలా వెంటాడాలి.
ఒక అలజడి నిద్ర పట్టనీయకుండా... కనుపాపలపై కాచుక్కూచోవాలి.
ఓ బాధ గుండెతో నిరంతరం సంఘర్షిస్తూ ఉండాలి.
ఓ నిరాశ సునామీలా బతుకునంతా చుట్టేయాలి.
ఓ అనుభూతి మాత్రం...
ఉద్వేగ తరంగమై మన దేహాలను ఆక్రమించుకోవాలి!
వీటన్నింటిని నా జీవితంలోకి సమృద్ధిగా చేరవేసిన
నా మిత్రులకు, శత్రువులకు, ఆత్మీయులకు, శ్రేయోభిలాషులకు...
నా పరిసరాలకు, పరిస్థితులకు... సహకరించిన చీకటి రాత్రులకూ...
నా ఈ “వెన్నెల చివుళ్ళు" ...
ప్రేమతో అంకితం.
- సునీత గంగవరపు
Preview download free pdf of this Telugu book is available at Vennela Chivullu
Login to add a comment
Subscribe to latest comments
