తెలుగు నవలా సాహిత్యంలో ముస్లింల జీవన విధానాన్ని, ఆచార వ్యవహారాల్ని - కటిక దారిద్ర్యంతో పాటు అవమానాలకూ పరాయీకరణకూ బలౌతున్న దూదేకులవారి దయనీయ స్థితిని సమగ్రంగా చర్చించిన మొట్టమొదటి నవల - వెండి మేఘం
పెళ్లంటే ఏమిటో తెలీని పదేళ్ళ వయసులో - తనకంటే పాతికేళ్ళు పెద్దయిన వ్యక్తికి రెండో భార్యగా - అతని కొడుక్కి తల్లిగా వచ్చిన 'అన్వర్' . . . స్త్రీలు ఆత్మగౌరవం, స్వంత వ్యక్తిత్వం కలిగి ఉండాలంటే జీవితమంతా పోరాడటం మినహా మరో దారిలేదన్న నిర్ణయానికి రావటానికి దారితీసిన పరిస్థితులు . . .
పవిత్రత ఉన్నచోట నిర్భయత, నిర్భయత ఉన్నచోట స్వంత్రత తప్పకుండా ఉంటాయని నమ్మిన ఆమె జీవితంలో చోటు చేసుకున్న అనూహ్యమైన సంఘటనలు . . .
పల్లెటూళ్లో పుట్టి, నిరక్షరాస్యతలో పెరిగీ, జీవితానుభవాలతో రాటుదేలిన ఒక ముస్లిం స్త్రీ ఎదుర్కొంటున్న సామాజిక, ఆర్థిక, సాంస్కృత సమస్యలు . . . వాటిని అధిగమించడానికి ఆమె చేసిన జీవన సమరానికి సజీవ చిత్రణే వెండి మేఘం
This book is the winner of prestigious Kendra Sahitya Academy award for the year 2005 ! ! !