• Vendi Ginnelo Pala Buvva
  • Ebook Hide Help
    ₹ 63
    70
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వెండిగిన్నెలో పాలబువ్వ

    Vendi Ginnelo Pala Buvva

    Author:

    Pages: 160
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మనిషి మమకారాలను యథాతధంగా కళ్ళకు కట్టడానికి రచయిత మిత్రుడు పట్టిన అక్షరాల అద్దం ఈ నవల.

'వెండిగిన్నెలో పాలబువ్వ' పేరులో వైవిధ్యం ఉంది. కథలో వైవిధ్యం వుంది. కథనంలో వైవిధ్యం ఉంది. ఎన్నో నవలల్నీ, ఎన్నెన్నో కథల్నీ సింహప్రసాద్ కలం తెలుగు పాఠకుడికి అందించింది. హారంలో దాగిన దారం లాగా ఆయన రచలన్నింటిలోనూ ఒక బలమైన అంతస్సూత్రం వుంది. ఆ సూత్రం పేరు జీవితం.

తన రచనలకి ముడిసరుకులు జీవితం నుంచే స్వీకరించగల మేధావి సింహప్రసాద్. సగటు మనిషి జీవితం ఎలా వుందో ఆయన కలం బొమ్మ గీచి చూపిస్తుంది. ఎలా వుండాలో తెలియజేస్తుంది. సమాజం ఎలా వుందో చూపిస్తుంది. ఎలా వుండాలో నిర్దేశిస్తుంది. ఆ అంతస్తు చేరుకోడానికి సోపానాలు ఎలా నిర్మించుకోవాలో, ఎలా అధిరోహించాలో నేర్పుతుంది. జీవితాన్ని నిశితంగా పరిశీలించి, సునిశితంగా ప్రవచింపగల నేర్పు రచయితగా సింహప్రసాద్ ఆస్తి. జీవితసారాన్ని వెదకి చూసి, వెతికి తీసి అందించే నైపుణ్యం ఆయన సొత్తు.

ఈ నవలలోని కథాంశాన్ని నేను వివరించను, పాఠకుల అనుభూతికే వదిలేస్తాను. సమాజంలో స్వార్థం వుంటుంది. స్వార్థా రాహిత్యమూ వుంటుంది, బలహీనతలుంటాయి, బలాలు వుంటాయి. ఆశలుంటాయి, ఆశయాలుంటాయి. విభిన్న తత్వాల సమ్మేళనమే పట్టణ వాతావరణంలో మొలకెత్తిన కథ పల్లె పట్టుకు సాగుతుంది. భోగిపళ్ళూ, ముగ్గులూ, గొబ్బెమ్మలూ, కనుమా - ఆ పాత్రల అనుభవానికి అంది వస్తాయి.

ఇందులో పట్నవాసజీవితాన్ని కలుషితం చేసిన అసహజత్వాలూ, అహంకారాలూ, పల్లెపట్టు జీవితాల్లో వెల్లివిరిసే అమాయకత్వాలూ, అక్కునజేర్చుకునే ఆత్మీయతలూ, జీవితాన్ని అటు స్వర్గంగానూ కాకుండా, ఇటు నరకంగానూ కాకుండా, జీవితాన్ని జీవితంగా చూసే సాధారణ, సహజ మనస్తత్వాలూ కనిపిస్తాయి. 'వెండిగిన్నెలో పాలబువ్వ' నవలలో రచయిత కన్పించడు, పాత్రలే సంభాషణల ద్వారా కథను నడిపిస్తాయి. సింహప్రసాద్ రచయితగా సాగించిన ప్రయాణాన్నీ, సాధించిన పరిణతినీ నిరూపించే శిల్పం అది. సింహప్రసాద్ గాలిలో తేలుతూ రచన చేసే రకం కాదు. ఆయన సృష్టించే పాత్రలూ అంతే. నిబ్బరంగా నేల మీద నడిచేవే. ఇది బహుమతి పొందిన నవల. రచయిత పాఠకులకు బహుమతిగా ఇస్తున్న నవల.

- వక్కంతం సూర్యనారాయణరావ్

Preview download free pdf of this Telugu book is available at Vendi Ginnelo Pala Buvva