-
-
వేమనయోగి ధ్యానములు
Vemanayogi Dhyanamulu
Author: Prof. M. Venkata Reddy
Pages: 154Language: Telugu
వేమన పద్యాలలోని ధ్యానములు ఒకచోట చేర్చాలనే ఆలోచన చాలాకాలం నుండి ఉంది. వేమన పద్యాలు అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు చదివినా నిత్యనూతనంగా ఉంటాయి.వేమన పద్యాలలో ప్రతీ ఒక్క పద్యం గొప్పదే. మనకు తెలియనంత మాత్రాన, తెలియనివి నిగూఢ పద్యాలని, మొండి పద్యాలని, సాంకేతిక పద్యాలని మనం సంతృప్తి పుతున్నాము.ఇటువంటి పద్యాలకు ఏదో పరమార్థం ఉండి ఉండలి. అది ఏమిటన్నది ప్రశ్న? అటువంటి అనేక పద్యాలకు యోగ/ధ్యాన కోణం నుండి పరిశీలన జరిగింది.
* * *
వేమన పద్యాలను చదివిన కొందరు పరిశోధకులు వేమన భావ సరళిలో వైరుధ్యం ఉందని వ్రాసారు. వేమన ఒకచోట సాకార ధ్యానం చెప్పితే, మరోచోట నిరాకార ధ్యానం చెప్పి - ఇలా ఒక్కోమెట్టు ఎక్కడం వంటిది. పై మెట్టు ఎక్కితే క్రింద మెట్టు విడచి పెట్టాలి కదా! ఇక విజ్ఞాన భైరవలో కూడ మొదట్లో శరీర అవయవాలపై ధ్యానం చేయాలని చెబితే 146వ శ్లోకంలో శరీర అవయవాలైన శరీరం, కళ్ళు, ముఖము, నోరు, చేతులు వగైరా పై కేంద్రీకరణ చేయటం ధ్యానం కాదన్నారు. ఇవి ధ్యాన సాధకులకు అనుభవమే.
* * *
వేమనయోగి పద్యాలలో ఏఏ ధ్యానములు ఉన్నాయి? ధ్యానమును సిద్ధ వేమన కూడ తెలుగులో వాడుక భాషలో అతి మధురంగా చెప్పారు. ఒక్కమాటలో చెప్పాలంటే 'మధురమైన యట్టి మనస్సు నిల్పెడి విద్య'' అని చెప్పాడు వేమన. వేమన పద్యాలలో అక్షయ నిధుల వంటి ధ్యానములు అనేకం కనిపిస్తున్నాయి. వేమన ముని ''సిద్ధ'' పదమునకు అర్థం. ''చింతలు విడిచిన వాడే సిద్ధుడు వేమా'' (పూర్ణమాచారి - 59) అన్నారు. విజ్ఞాన భైరవతో వేమనయోగి ధ్యానములను తులనాత్మక పరిశీలన చెయ్యడం ప్రస్తుత గ్రంథం ''వేమనయోగి ధ్యానములు'' ఉద్ధేశ్యం. నేటి మన చింతలు పోవాలంటే ఈ ధ్యానాలు ఉపకరిస్తాయి. మహాసిద్దుడు వేమన ధ్యానాలు ఏమేమి చెప్పారు? ఎలా చెప్పారు? ఈ పుస్తకం తెరవండి. చదివిన చాలదు. ఈ ధ్యానముల వైపు ధ్యాస మళ్లించండి. ధ్యాన సాధన చేయండి.
