-
-
వేమన మంత్రాలు
Vemana Mantralu
Author: Vasundhara
Publisher: Kavya Publishing House
Pages: 34Language: Telugu
ఇది నయుడు, వినయుడు అనే అన్నదమ్ముల కథ. వారి తండ్రి మహా పండితుడు. కానీ అతి గారాబం వలన అన్నదమ్ములిద్దరికీ జ్ఞానమబ్బలేదు.
వీరి తల్లి చనిపోతే, తండ్రి మరో వివాహం చేసుకుంటుంది. సవతి తల్లి నయవినయుల్ని సరిగా చూడదు. వారెళ్ళి తండ్రితో మొర పెట్టుకుంటే ఆయన వేమన మంత్రాలని అనుసరిస్తున్నాను అని అంటాడు. అదేమిటని పిల్లలడిగితే వేమన చెప్పిన పద్యాలను సందర్భోచితంగా అమలు చేస్తున్నాను అంటాడు.
నయవినయులకి పరిస్థితి అర్థం అవుతుంది. తండ్రి దగ్గర నుంచి మరికొన్ని వేమన మంత్రాలను తీసుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోతారు. దారిలో ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు ఎదుర్కుంటారు. అటువంటి సమయాల్లో ఒక్కో వేమన మంత్రం వారికి జ్ఞానం కలిగిస్తూ ఉంటుంది.
చివరికి వారిద్దరూ వేమన మంత్రాలతోనే ప్రయోజకులవుతారు.
15 వేమన పద్యాలతో ఈ కథని అల్లినది వసుంధర. ఈ కథలకు చక్కని వర్ణచిత్రాలకు సమకూర్చినది కరుణాకర్.
ఈ చిన్న పుస్తకం పిల్లలనే కాకుండా పెద్దలని సైతం ఆకట్టుకుంటుంది.
