• Veguchukkalu
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 86.4
    96
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వేగుచుక్కలు

    Veguchukkalu

    Author:

    Pages: 163
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఈ వ్యాస సంపుటిలో తొలి తెలుగు సంకీర్తనాచార్యుడు తాళ్ళపాక అన్నమాచార్యులు, తొలి తెలుగు అభ్యుదయ కవి వేమన, అగ్రకుల ఆధిపత్యం నుండి దేవుడిని, దైవతత్వాన్ని ప్రజాపరం చేసిన పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిలపై సహేతుకమైన, సత్య శోధనాయుతమైన వ్యాసాలు ఉన్నాయి. ఈ మూడే కాకుండా కక్కయ్య, సిద్ధయ్య గురించిన లఘు రచనలూ
ఉన్నాయి. అన్నమయ్య, వేమన, బ్రహ్మన్న ఈ ముగ్గురూ తమ దృక్పథాన్ని, తత్వాన్ని జనసామాన్యానికి యొరుకపరచడానికి కవితా రచనే బలమైన ఆయుధంగా స్వీకరించారు. వెయ్యేళ్లకు పైగా లిఖిత చరిత్ర ఉన్న తెలుగు సాహిత్యంలో ప్రబంధ, పురాణ కర్తల సాహిత్యం, మేధావుల మస్తిష్కాలలో పదిలంగా ఉంటే - ఈ మువ్వురూ తమ సామాజిక దృక్పథంతో వెలువరించిన కవిత్వంతో అశేష జనావళికి సతత హరిత స్ఫూర్తినిస్తునే ఉన్నారు. అక్షరం ముక్క రాని పామరులు సైతం ఈ ముగ్గురి కవిత్వంలోని పద్యమో, పాటో, తత్త్వగీతమో అడిగిన తడవుననే వినిపిస్తారు. తరతరాలుగా నాలుక నుండి నాలుక మీదికి ఈ ముగ్గురి జవజీవ కవిత్వం, వారసత్వ సంపదగా అంది వస్తూనే ఉంది. కాల పరీక్షల్లో యొదురు నిలిచి పురోగమిస్తునే ఉంది. ఇంతటి ఘనతరమైన కాలాతీత విజయసాధనకంటే - ఏ కవి అయినా ఏ తాత్వికులైనా ఏ సంస్కర్తలయినా యొక్కువ ఏమి ఆశించగలరు? కవిత్వంలో తరతరాలుగా సజీవులై సాక్షాత్కరిస్తున్న ఈ త్రయం - జీవన సాఫల్యం ప్రతి యుగంలోనూ (అన్నమయ్య 15వ శతాబ్దం, వేమన, బ్రహ్మం 17వ శతాబ్దం) సాధిస్తుండం అపూర్వం.

ఈ ముగ్గురి గురించి తులనాత్మక పరిశీలన చేస్తూ వినోదిని వ్రాసిన ఈ పుస్తకం సాహిత్య చరిత్రలో ఒక దారి దీపం.

- శశిశ్రీ

Preview download free pdf of this Telugu book is available at Veguchukkalu