-
-
వీరి వీరి గుమ్మడిపండు వీరి పేరేమి?
Veeri Veeri Gummadi Pandu Veeri Peremi
Author: Dr. Chaganti Krishna Kumari
Publisher: Vanguri Foundation of America
Pages: 118Language: Telugu
ఎన్నో రకాల పుస్తకాలు ఉన్నాయి. మనకు తెలిసినవి గ్రంథాలయంలో ఉన్నవి కొన్ని పుస్తకాలు మాత్రమే. వాటిలో రామాయణం, మహాభారతం వంటి పురాణాలు, కవితల పుస్తకాలు, ఎన్నో విజ్ఞానదాయకమైన పుస్తకాలు ఉన్నాయి. అలాగే దేశనాయుకులు వారి జీవిత చరిత్ర పుస్తకాలు ఎన్నో రచింపబడి ఉన్నాయి. ఎన్నో పుస్తకాలు ఎందరో మంచి రచయితలు రచించారు.
మంచి పుస్తకాలు చదవడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఏ పుస్తకం చదివినా మనకు ప్రయోజనాలే ఉంటాయి. కాని ఉపయోగపడనిది ఏది ఉండదు. మరీ ముఖ్యంగా దేశనాయకుల పుస్తకాలు. వారు దేశం కోసం చేసిన పోరాటాలు వంటి పుస్తకాలు చదివితే వారు ఎంత గొప్పవారో, వారు దేశం కోసం ఎన్ని పోరాటాలు చేశారో మనకు పుస్తకాల ద్వారానే తెలుస్తుంది. అలాంటి మంచి పుస్తకాలు మన రచయితలు చక్కగా రాసారు.
"పజిల్స్” అనేవి ఒక ఆటలాంటివి కావు. అవి మనం పరిశీలిస్తే వాటి ప్రయోజనాలు అర్థం అవుతాయి. పజిల్స్ మన మెదడుకు ఎంతో ఉత్సాహాన్ని కలుగజేస్తాయి. అవి మనం చేస్తుంటే చేయాలనిపించేలా ఉంటాయి. ఉదాహరణగా ఒక వ్యాసం ఇచ్చి దాని మీద కొన్ని సూచనలు ఇచ్చి, ఆ పుస్తకం రచించిన వారి పేరు తెలపండి. అలాంటి ప్రశ్నలు ఎన్నో ఉంటాయి. పిల్లలికి ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాంటి “పజిల్స్" లేదా "ప్రహేళికలు" ఆదివారాల్లో, దినపత్రికల్లో మనం ఎక్కుగా చూస్తూంటాం. అలాంటివి చేస్తే మన మెదడు ఎంతో చురుగ్గా పనిచేస్తుంది. మెదడుకు మేత అంటే మరేమిటీ కాదు. మనిషికి అన్నం తింటే ఎంత పుష్టిగా ఉంటుందో అలాగే మెదడుకు ఎటువంటి పనీ చెప్పకపోతే అది మొద్దుబారిపోతుంది. “మెదడుకు మేత” పెట్టాలంటే “పజిల్స్” ఎన్నో రకమైన “సుడోకులు" ఉంటాయి. అలాంటివి మనం ఎక్కువగా చేస్తుంటే మన మెదడు చురుగ్గా, వేగంగా ఉత్సాహంగా, ఎంతో ప్రయోజనకరంగా మారుతుంది. చదరంగం ఆడటం వలన మన ఏకాగ్రత పెరుగుతుంది. ఏకాగ్రత లేని వారు “బెల్లం కొట్టిన రాయి వంటి వారు". మన మెదడు చురుగ్గా ఏకాగ్రతగా ఉండాలి. అంటే ఇటువంటి చదరంగంలాంటివి, పజిల్స్ వంటివి ఎక్కువగా ఆడుతుండాలి. “మనకు తెలిసింది గోరింత తెలియాల్సింది కొండంత" అనడంలో సందేహం లేదు. మనకు తెలియాల్సినవి చాలా ఉన్నాయి.
శాస్త్రవేత్తల గురించి వారి జీవితం గురించి వారు చేసిన పరిశోధనల గురించి ఈ పుస్తకంలో రాసారు. మేము ఈ పుస్తకం చదివిన తరువాత మాకు ఈ పుస్తకం పై ఒక అభిప్రాయం కలిగింది. అది ఏమిటంటే మన సమాజంలో ఎంతోమంది శాస్త్రవేత్తలు ఉన్నారు. వాళ్ళందరూ గొప్పగొప్ప చదువులు చదివి పైకి వచ్చినవారే. అందులో మన భారతదేశంలో నుండి C.V.Raman, J.C. Bose మరియు E.K. Ammal etc... ఉన్నారు. Roy. J. Piunkette, Margarate Knight ఉన్నారు. వాళ్ళు ధనవంతులేమి కారు. మనలాగే పేద తల్లిదండ్రులకు పుట్టినవారే. వీరంతా నిరుత్సాహికి ఉత్సాహాన్ని ఇస్తున్నారు. ఈ పుస్తకం చదవడం వల్ల కలిగిన ఉత్సాహమే అందుకు నిదర్శనం.
- T. భానుప్రియ
M. ఎనోష్ కుమార్
గమనిక: " వీరి వీరి గుమ్మడిపండు వీరి పేరేమి? " ఈబుక్ సైజు 6 mb
This appears to be a new, stimulating and unique approach to teaching science. The presentation is a warm, personal approach. The importance of knowing the biographical aspects of a scientist is mostly forgotten in the society. Such detail would encourage a young mind identify self with the scientist and to emulate in real life. I shall try to distribute copies of the book to students and libraries of schools. Dr.M.Bapuji, retd CSIR Scientist, Prof.KLUniversity. bapujim@gmail.com