• Veeraram Estate
  • Ebook Hide Help
    ₹ 30 for 30 days
    ₹ 60
    65
    7.69% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వీరారం ఎస్టేట్

    Veeraram Estate

    Pages: 64
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

పైడిపుట్ట గ్రామం అక్కడికి రెండు మైళ్ళ దూరంలో వుంది. అది కోయ దొరల గ్రామం. వూరిలో నాలుగు వీధులున్నాయి. మొత్తం మూడువందలకు పైగా చిన్న చిన్న గుడిసెలు వున్నాయి. ఆడ, మగ అందరూ తెల్లటి రంగులో అందంగా, బలిష్టంగా వున్నారు. రాఘవేంద్ర, మరిడయ్యలను ఆ గ్రామ పెద్ద సింగన్న దొర గుడిసె దగ్గరికి తీసికెళ్ళాడు మహంకాళి.

లోపలినుంచి సుమారు ఎనబై ఏళ్ల వయసున్న ముసలి వ్యక్తి బయటికి వచ్చి ఒక నులకమంచం వాల్చి రాఘవేంద్రను కూర్చోమని చెప్పాడు. "ఈయనే సింగన్న దొరగారు. ఈ గ్రామ పెద్ద" అంటూ పరిచయం చేశాడు మహంకాళి. రాఘవేంద్ర సింగన్న దొరని నిశితంగా చూశాడు. చిన్న కళ్ళు, విశాలమైన నుదురు, పలచబడి నెరిసిన జుట్టు, ఆరడుగుల ఎత్తు, దారుఢ్యం సడలని ఒళ్ళు, నీరుకావి పంచ, భుజం మీద చిన్న కండువాతో వున్నాడు సింగన్న దొర.

తనని పరిచయం చేసుకొని " చూడండి ! యీ అడవిలో ఎక్కడన్నా మేలుజాతి కలప చెట్లు కానీ, నల్ల ఇరుగుడు చెట్లు కానీ వున్నాయా చెప్పండి జమీందార్ గారికి కొత్త భవంతి కట్టటానికి" అని అడిగాడు రాఘవేంద్ర.

అప్పటివరకూ చిరునవ్వుతో కనిపించిన సింగన్న దొర మొహంలో ఒక్కసారిగా ఆగ్రహ జ్వాల కనిపించింది. రాఘవేంద్ర పక్కనే వున్న మరిడయ్యను తీక్షణంగా చూసి

" ఒరే మరిడా ! నీకు ఎన్నో సార్లు చెప్పాను ఇక్కడికి రావద్దని. అయినా మళ్ళీ మా వూళ్ళోకి వచ్చావు. ఇప్పుడు ఈ పట్నం బాబుని వెంటబెట్టుకొని మరీ వచ్చావు. ఇంతవరకు నువ్వు, నీ జమీందార్లు చేసిన ఘోరాలు చాలవా ?" అన్నాడు మరిడయ్యను చూసి.

" లేదు పెద్దయ్యా ! ఈ ఒక్కసారికే. మరెప్పుడూ ఇటుకేసి రాన్లే." అన్నాడు మరిడయ్య మొహం మాడ్చుకుంటూ.

" ఒరే కాళీ ! మరి నీ సంగతేంటి ? మీరు వూరొదిలి ఇక్కడేం చేద్దామని వచ్చావ్ ?" అంటూ కోపంగా ప్రశ్నించాడు సింగన్న దొర మహంకాళిని.

" చూడండి దొరగారూ ! మీకు ఇబ్బంది పెట్టినందుకు క్షమించాలి. ఇంతకుముందే మహంకాళి చెప్పాడు. ఇక్కడ కలప ఏదీ దొరకదని. మేం వెళ్లోస్తాం" అని లేచి వెళ్లిపోయాడు రాఘవేంద్ర. మరిడయ్య మొహం చిన్న బుచ్చుకుంటూ అతన్ని అనుసరించాడు. మహంకాళి నిదానంగా అక్కణ్ణించి జారుకున్నాడు. రాఘవేంద్రకు పరిస్థితి కొంత వరకు అర్ధమయ్యింది. జామీందారీ కుటుంబం పట్ల ఆ గ్రామస్తులకి వున్న కోపం, ద్వేషం తెలియటంతో అతను నిర్విజ్ఞుడయ్యాడు. ఈ సారి తానొక్కడే వస్తే నిజాలు కొంతవరకైనా తెలుస్తాయనుకున్నాడు.

Preview download free pdf of this Telugu book is available at Veeraram Estate