• Vedokta Garbhadanam
 • Ebook Hide Help
  ₹ 60 for 30 days
  ₹ 216
  240
  10% discount
  • fb
  • Share on Google+
  • Pin it!
 • వేదోక్త గర్భాధానము

  Vedokta Garbhadanam

  Pages: 43
  Language: Telugu
  Rating
  4.33 Star Rating: Recommended
  4.33 Star Rating: Recommended
  4.33 Star Rating: Recommended
  4.33 Star Rating: Recommended
  4.33 Star Rating: Recommended
  '4.33/5' From 3 votes.
  4 Star Rating: Recommended
  4 Star Rating: Recommended
  4 Star Rating: Recommended
  4 Star Rating: Recommended
  4 Star Rating: Recommended
  '4/5' From 2 premium votes.
Description

వేదోక్త గర్భాధానము

రతి విధి – సంభోగ నియమములు

వేదములు కేవలము హోమములు, యజ్ఞములు, ఆరాధనలు ఉపాసనలు వివరించుటే కాదు, మానవుడు చేయు అనేక కార్యములను సరిగ్గా చేయు పద్దతులను వివరించును. విశేష సమయములలో వస్త్రధారణ ఎట్లుండవలెను, భోజనము చేయు పద్దతి యేమిటి, మొదలుకొని గృహములో చేయు అనేక కార్యములు చేయవలసిన విధానములను వివరిస్తాయి. మానవ జీవితమున అతి ముఖ్యమైన శృంగారము నెట్లు సలుపవలెనో కూడా వర్ణించినాయి.

వివిధ వేద భాగములు, స్మృతులు, అనేక ఇతర ప్రయోగ గ్రంధములలో స్త్రీపురుషుల కలయిక గురించీ, దాని విధానము, నియమములు మొదలైనవి సంగ్రహించి వీలైనన్ని ఎక్కువ వివరములు ఇచ్చుటకు ప్రయత్నము చేసితిమి.

ఇది కామ శాస్త్రము కాదు. కామ కళా రహస్యములు ఇందులో ఉండవు. రతి భంగిమలు మొదలైనవి ఇందులో చర్చించలేదు. పూర్వకాలమున వివాహములు అతి చిన్న వయసులోనే జరిగేవి. బాలుడికి చిగురు మీసాల వయసు రాగానే అతడిని భార్యతో సమావేశనము చేయించేవారు. కాబట్టి, వారికి అన్నీ అర్థమగునట్లు వివరముగా యేమేమి చేయవలెనో పెద్దలు వివరించే వారు. వారికి సంభోగ నియమములు తెలియుటకు ఆధారము వేద మంత్రములు. వేద మంత్రములు మైథున విధి నియమములతో పాటూ సంభోగ ప్రక్రియను కూడా సంపూర్ణముగా వర్ణించి దంపతులు సుఖ సంతోషములతో రమించి, సుపుత్రులను పొందుటకు అనువుగాను, దోషములు పాపములు కలుగకుండునట్లు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించినాయి. పుత్రులు/లేదా పుత్రికలు కావలెనన్న, యేయే దినములు అనువైనవి, ఎటువంటి పుత్రులు కావలెనన్న యే దినము అనుకూలము మొదలగు విషయములు వివరింపబడినాయి. ఇవి ఈనాడు సమాచార విస్ఫోటనము ఎంత ఎక్కువగా ఉన్ననూ, నూతన యౌవ్వన వంతులకు మార్గదర్శనము తప్పక ఈయగలవు.

శుభములు కావలెననువారు తప్పక తెలుసుకోవలసిన విషయములు ఇందులో ఎన్నో గలవు.

- సమయజ్ఞ సామాజిక సభా ట్రస్ట్

Preview download free pdf of this Telugu book is available at Vedokta Garbhadanam