• Vedalenu Kodandapani
  • Ebook Hide Help
    ₹ 180
    200
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వెడలెను కోదండపాణి

    Vedalenu Kodandapani

    Pages: 228
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

ఎప్పుడో 2007 లో మొదలు పెట్టి ఏదో రాద్దామని ప్రయత్నం చేస్తూంటే అప్రయత్నంగా ఒక కథ తన్నుకు వచ్చింది మనసులోంచి. దాన్ని వంగూరిగారికి పంపించాను ఉగాది పోటీలకి, అనుకోలేదు కానీ దానికి రాజుగారు మొదటి బహుమతి ఇచ్చేసరికి అబ్బో నేనూ రాయగలను అనిపించిందంటే అది వంగూరి గారి చలవే. ఆ తర్వాత ఈమాట వారు మొహమాటంతో వేసినందుకు కొన్ని కథలూ - కాకరకాయలూ రాసాను. ఆ తర్వాత ఒక్కొక్కటిగా అనువాదాలూ, భాగవతంలో కథలూ అన్నీ వచ్చాయి బయటకి. ఇందులో కథలు ఈమాట, సారంగ, సుజనరంజని వగైరా పత్రికలలో ప్రచురించారు. ఏవి ఎక్కడ ప్రచురించారనేదీ, ఆ కథకి వచ్చిన ప్రేరణా, ప్రతీ కథ చివర్లో రాసాను.

ఇందులో నాకు అన్నింటికన్నా బాగా నచ్చిన కథ ఈ సంపుటికి పెట్టిన పేరుతో ఉన్న 'వెడలెను కోదండపాణి' అనేది. లియో టాల్ స్టాయ్ కథలు ఇప్పటికీ నాకు కంట్లో నీరు తెప్పించేవే. నాకు బాగా నచ్చే - కవిత దృష్టిలో, భాషాపటిమ ద్వారా లేదా హిందూ ధర్మ విషయాల ద్వారా – మహాభారత, రామాయణ, భాగవతాలలో కథలన్నీ క్రోడీకరించి ఇలా పుస్తకంగా వేస్తానంటే వెంటనే ముందుకి వచ్చిన వంగూరి గారికి ఎంతైనా కృతజ్ఞుడను. ఈ పుస్తకం ఎవరైనా కొంటే, ఆ డబ్బు కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉండే బెర్కిలీ యూనివర్సిటీ తెలుగుపీఠానికి ఇస్తానని నేను పూర్తిగా - ఒక్క సెంటు కూడా తీసుకోకుండా, నేను రాసిన ఈ కథల సాక్షిగా, భగవంతుడి సాక్షిగా ముందే ఒప్పుకున్నాను. ఇండియా తెలుగు రాష్ట్రాలలో మన స్వంత ప్రభుత్వాలు, తెలుగు భాషాభివృద్ధికి చేయలేని పని ఎక్కడో అమెరికాలో ఉండే వారు చేయడం గొప్ప విషయమే కదా? కనీసం అలా అయినా తెలుగు భాష బాగుపడుతుందనే నమ్మకం.

ఇందులో కథలు ఆయా పత్రికలు ప్రచురించాక చదివి చాలామంది మెచ్చుకున్నవి. మీకు కూడా నచ్చుతాయని ఇలా పుస్తకంగా తీసుకొచ్చాము. ఈ కథలని పుస్తకంగా చేయడానికి నేను పడిన శ్రమ - వంగూరి రాజుగారు పడే శ్రమలో శతసహస్రం మాత్రమే. నన్ను కథకుడిగా మొదటనుంచీ అదరించి ఇప్పటివరకూ వెన్నుదన్నుగా నిలిచిన రాజుగారి సహాయం ఏనాటికీ తీర్చుకోలేనిది.

- ఆర్. శర్మ దంతుర్తి

Preview download free pdf of this Telugu book is available at Vedalenu Kodandapani