• Vedagiri Rambabu Parisodhanalu
  • Ebook Hide Help
    ₹ 60 for 30 days
    ₹ 216
    240
    10% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వేదగిరి రాంబాబు పరిశోధనలు

    Vedagiri Rambabu Parisodhanalu

    Pages: 560
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మనచుట్టూ ఉన్నవాళ్లలో చాలామంది గురించి మనకు తెలియదు. అలాంటి వాళ్ళ గురించి తెలుసుకోవాలని చేసిన ప్రయత్నమే ఈ పరిశోధనలు. పరిశోధనలంటే డిటెక్టివ్‌ పరిశోధనలు కావు, సరాసరి మనకి తెలీని కొందరి జీవితాలలోకి తొంగి చూసే ప్రయత్నం.

సాధారణంగా మనం ఎవరైనా, ఏదైనా నేరం చేస్తే-ఆ నేరాన్ని ఎంతఘోరంగా చేశారు? అతనికి ఏ శిక్ష పడింది? వరకే ఆలోచిస్తాం. కానీ, అతను లేక ఆమె జైలులోకి వెళ్లిన తర్వాత వీళ్ళు మానసిక పరిస్థితి ఎలా ఉంది? ఆ నేర ప్రభావం వాళ్ల కుటుంబాల మీద, సమాజం మీద, అతను లేక ఆమె మీద ఎలా పడింది? వాళ్ల మానసిక పరిస్థితి లాంటి విషయాలను మీ ముందుంచటానికి రాష్ట్రంలోని అన్ని జైళ్లూ తిరిగి సేకరించిన సమాచారంతోపాటు ఖైదీలతో ముఖాముఖిని కూడా 'జైలు గోడలు మధ్య'లో రాయటం జరిగింది. పుట్టుకతోనే ఎవ్వరూ నేరస్థులు కారు. రకరకాల పరిస్థితులు వాళ్లని నేరస్థులని చేస్థాయి. ఆ పరిస్థితులను కనుక మనం తెలుసుకుంటే, అలామాత్రం ఆ సందర్భాలలో ప్రవర్తించకుండా ఉంటాం. నేరస్థులు అనారోగ్య లక్షణాల లాంటివారు. ఈ లక్షణాలు మూలకారణం సమాజంలోనే ఉంది. కాబట్టి ఈ లక్షణాలద్వారా మూలకారణాలని తెలుసుకొని సమూలంగా సంస్కరించాలి.

పెద్దవాళ్ళకైతే నేరాలు చేయటానికి కొన్ని కారణాలుంటాయి. మరి బాలనేరస్థులు ఎందుకు తయారవుతున్నారు? తల్లి, తండ్రికి భారమైనవాడు సమాజానికి భారమవుతాడు. తండ్రి లేకుండా పెరిగినవాడికి క్రమశిక్షణ ఉండదు, తల్లి లేకుండా పెరిగిన వాళ్లకు ప్రేమ తెలియదు, ప్రేమ తెలియనివాడు సమాజానికి ప్రేమనందివ్వలేడు. మితిమీరిన క్రమశిక్షణా పనికిరాదు. అసలు పట్టించుకోకపోవటం అంతకన్నా నేరం, పిల్లలకెప్పుడూ తల్లిదండ్రులు భార్యాభర్తల్లా కనిపించకూడదు- ఇలాంటి ఎన్నో నిజాల్ని కొందరు వీధిబాలల ద్వారా చెప్పిన పరిశోధన 'పాపం పసివాళ్ళు'.

మూడవ పరిశోధన 'అగ్నిసాక్షి' వరకట్న మరణాల్ని అన్ని కోణాల నుంచి పరిశోధన జరిపిన కేస్‌స్టడీస్‌తో రాయడం జరిగింది. ఆ విషయాలన్నింటినీ కూలంకషంగా చర్చించిన యధార్థగాధలివి.

నాల్గవ పరిశోధన 'వీళ్లేమంటారు?' మనం వీళ్లని కలవక తప్పదు. కానీ, వాళ్లగురించి ఆలోచించటానికి ఇష్టపడము. అటువంటి అట్టడుగు జీవితాల రేఖాచిత్రాలు ఇవి. సమాజంలో పేడపురుగుల్లాంటి వారు. వీళ్ళులేకపోతే చాలామలినాలు మనందరి జీవితాలకి ఇన్ఫెక్షన్స్‌లా వ్యాపిస్తాయి.

ఈ నాలుగు విభాగాలనూ యధార్థగాథలతోనే నడిపించడం జరిగింది. ఒక్కో పరిశోధనకీ దాదాపు సంవత్సరం పట్టింది. ప్రత్యేక సామాజిక బాధ్యతతో నేను ఈ పరిశోధనలు చేశాను.

- వేదగిరి రాంబాబు

Preview download free pdf of this Telugu book is available at Vedagiri Rambabu Parisodhanalu