• Vedagiri Rambabu Kathanikalu
  • fb
  • Share on Google+
  • Pin it!
 • వేదగిరి రాంబాబు కథానికలు

  Vedagiri Rambabu Kathanikalu

  Pages: 164
  Language: Telugu
  Rating
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  Be the first to vote
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  0 Star Rating: Recommended
  '0/5' From 0 premium votes.
Description

మానవ జీవన వైకల్యాలు, సంక్లిష్ట మానవ సంబంధాలు అరిషడ్వార్గాల ఆటలు, అస్తిత్వ వేదనలు సెంటిమెంటల్‌లోతులు, ఏ రసమైనా మానవ స్వభావ పరిధిలోనే యిమిడ్చి రాంబాబు చెప్పడం - విమర్శకులకు నచ్చే విషయం. బహుళ ప్రమోదాన్విత రచనల ఆర్ద్రతతో తడిసిపోయినవాడు, అందుకనే అతడు నిర్నిద్రరచనా వ్యగ్రుడైనాడు. తన అభివ్యక్తీకరణలో అక్షరశక్తి కన్నా భావుక పరిణతకే పట్టాభిషేకం చేసినవాడు. 'అర్థాంగి', 'తల్లి' 'గొప్పదానం', 'అస్పష్ట ప్రతిబింబాలు' యిత్యాది కథానికల్లో సామాన్య పాఠకులకు తెలియని అవయవదానం గురించిన అవగాహన, 'భయం' కథలో హైద్రాబాద్‌కు Specific సమస్య - పతంగుల పండుగలో ఘోర ప్రమాదాల హెచ్చరిక, 'అద్దంలో బింబం'లో అభద్రతకు నిర్వచనం చెబుతూ ''ఆయన పోయిన తర్వాత, ఇంటి చుట్టూ కాంపౌండ్ వాల్ పడిపోయినట్లయింది'' అంటాడు. బూజుపట్టిన పురాతన మూఢాచారాల మీద తిరుగుబాటు కథ - 'లక్ష్యం'. సినిమా కథల చౌర్యమూలాలను అత్యంత వ్యంగ్యంగా బయటపెట్టిన కథ - ''అనగనగా'' యీ కాలపు ''యువ'' సినిమాల Fans తప్పక చదవాలి. ఈ ఇరవై కథలకూ ఒక దిశానిర్దేశం విధించుకొన్న శ్రీరాంబాబు వ్యక్తంగానో అవ్యక్తంగానో, కథానిక శిల్ప ప్రాథమిక సూత్రానికి కట్టుబడినట్లు. నేననుకొంటున్నాను - "A Short Story gives less and asks more" అంటే పాఠకుడి మెదడుకు మేతనిస్తుందని. అది శిల్ప రహస్యం.

- మునిపల్లె రాజు

* * *

ఆధునిక కథానికా నిర్వచనానికి లక్ష్య ప్రాయమయిన రచనలు చేశారు రాంబాబుగారు. కథానికా శిల్ప విన్యాసాన్ని వెలిగింపజేసే కథలు అనేకం ఉన్నాయి. వాటిలో హృదయాన్ని కదిపేవి కొన్ని, కుదిపేవి కొన్ని; కళ్ళను చెమరింపజేసేవికొన్ని, మెరిపింపజేసేవి కొన్ని! వాటిలోంచి ఏర్చికూర్చిన కథానికల పూలగుత్తే మనచేతిలో ఉన్న ఈ పుస్తకం, దీనిలోని ఒక్కొక్క కథానికా పుష్పం సహజ సుందర శిల్పవికాస రూపం. ఒక్కొక్క కథానికా వస్తువు సమకాలిక సామాజిక/వైయక్తిక సంక్లిష్టతావలయంలోనుంచి లాగి మానవ జీవనశకలంగా రూపుగట్టించినది. ఈ విధంగా వస్తు శిల్పకళాకృతులను దాల్చిన ఈ కథానికలు ఈనాటి సమాజానికి అత్యంతావశ్యక మయినవి. మనచుట్టూ ఉన్న సమాజంలో జరుగుతున్న మంచిచెడులను మనం గమనించకపోవచ్చు; గమనించలేకనూ పోవచ్చు. వాటి ప్రభావాలకు మనలో స్పందన లేకపోవచ్చు. కాని రాంబాబుగారి కథానికలు, వాటినన్నింటినీ మన దృష్టికి తెస్తాయి. మనలో స్పందనను కలిగిస్తాయి. ఒక వ్యక్తి మనస్తత్వంలోని వెలుగు నీడలను స్పష్టంగా చూపిస్తాయి.

- పోరంకి దక్షిణామూర్తి

* * *

రాంబాబు కథలన్నింటిలో, ఏదో ఒక ప్రత్యేకత వుంది. 'క్వాలిటీ'కి -యీ కథానికలు మాగ్జిమమ్‌గ్యారంటీ యిస్తాయి. షార్ట్‌స్టోరీస్‌కి-ఆద్యులలో ఆద్యుడైన-డిటెక్టివ్‌కథల బ్రహ్మ-అమెరికన్‌ రచయిత 'ఎడ్గర్‌ ఆలెన్‌ పో'గారు అన్నట్లు-షార్ట్‌స్టోరీస్‌కి కావాల్సిన 'మూడ్‌' వీటిలో వుంది. కథనంలో ప్రగతిదాయకగమనం, ఉత్కంఠ కూడా రచయిత పొందుపరచాడు-మరిచిపోలేదు.

- వీరాజి

* * *

రాంబాబు కథానికలు చదవండి- నేనేం గొప్పవాడిననీ, సద్గుణ సంపన్నుడననీ చెప్పుకోడీ రచయిత. సామాన్య మానవుడే. మన మధ్యే తిరుగుతూ మనకు కనిపిస్తుంటాడు-కొన్ని కథానికల్లో కనిపిస్తూ తానూ మామూలు మనిషినేనని తనకూ బలహీనతలున్నాయని చెప్పుకొని అద్భుతమైన కొసమెరుపుతో కథానికను సమాప్తి చేస్తాడు. మంచి కథానిక మనసుని వెంటాడాలి-అందులోని వ్యక్తులు సజీవంగా మనకు కనపడాలి- వర్ణన పేరుతో చేతులు నొప్పెట్టే విపరీతపు లెక్కలు లేకుండా మృదువుగా సూటిగా కథను చెప్పడంలో రాంబాబు స్టయిలే వేరు- ఏ కథానికా నాలుగు పేజీలు మించి లేవు ప్రింటులో- 'అనిక' అంటే చిన్నదనేగా అర్థం? ఆలస్యమెందుకూ చదవండి తెలుస్తుంది మీకే!

- బాలి

Preview download free pdf of this Telugu book is available at Vedagiri Rambabu Kathanikalu