-
-
వేద విజ్ఞాన లహరి
Veda Vignana Lahari
Author: Multiple Authors
Publisher: Yuva Bharathi
Pages: 152Language: Telugu
వేదాలలోని సామాజిక విజ్ఞానశాస్త్రాంశాలను గూర్చిన విద్వన్మణుల ఉపన్యాస వ్యాస మంజరి- ఈ "వేద విజ్ఞాన లహరి".
వేదాలు ఆధ్యాత్మికచైతన్యం కలిగించంతో బాటు మానవునిలో సత్ప్రవర్తనను పెంపొందించనికి, ఉదాత్తమైన సంస్కృతిని నెలకొల్పడనికి తోడ్పడతాయి. వేదతత్త్వం భారతీయుల భావనలో, జీవనంలో, సంస్కృతిలో ప్రతిబింబిస్తుంది. వేదాలలో ఈనాటి సమాజానికి కూడ ఉపయోగపడే సాంఫిుక విజ్ఞాన శాస్త్రాంశాలెన్నో నిబిడీకృతమై ఉన్నాయి. ప్రపంచమంతా ఇప్పుడా విషయాన్ని గుర్తిస్తోంది. భూతభవిష్యద్వర్తమానాల తిరుగులేని సత్యాలను ఆవిష్కరించిన దివ్యజ్ఞానరాశి వేదం.
వేదాలలోని సాంఫిుక విజ్ఞాన శాస్త్రాంశాలను రేఖామాత్రంగా సామాన్యులకు తెలియజేయాలనే సత్సంకల్పంతో వేదవిజ్ఞానలహరి కార్యక్రమాన్ని 'యువభారతి' తలపెట్టింది.
2009 ఆగస్టు 16,17,18 తేదీలలో సాయంత్రం 6.15ని||లకు హైదరాబాదు హిమాయత్‌నగర్‌లోని తిరునిలయంలో వేదవిజ్ఞానలహరి కార్యక్రమాలు దిగ్విజయంగా నిర్వహింపబడ్డాయి. పత్రికలవారు, ప్రసారమాధ్యమ సంస్థలవారు ముఖ్యంగా శ్రీ వేంకటేశ్వ భక్తి ఛానల్ వారు కార్యక్రమ ప్రచార కార్యక్రమాలలో తోడ్పాటందించారు. ఆ ఉపన్యాస వ్యాసాలను, అదనపు వేద
సమాచారం కోసం మేం కోరగానే వ్యాసాలందించిన డా. కొత్తపల్లి ఘనశ్మామల ప్రసాదరావు, బ్రహ్మశ్రీ మాణిక్యశర్మ గార్లకు మేమెంతో ఋణపడి ఉన్నాం. వీరితోబాటు మాకు సహకరిస్తున్న ఆర్షవిజ్ఞానధర్మజ్ఞులకు సాహితీ బంధువులకు అక్షర సుమాంజలులర్పిస్తున్నాం. ఇప్పుడ వ్యాసాలను 'వేద విజ్ఞాన లహరి' గ్రంథంగా ప్రచురిస్తున్నాం. దీనిని సహృదయ పాఠకలోకం
ఆదరించి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం.
- యువభారతి

- FREE
- FREE
- ₹180
- FREE
- ₹270
- FREE