-
-
వేదగణితం, లీలావతీగణితం & పావులూరిగణితం - రివైజ్డ్
Veda Ganitam Lilavati Ganitam And Pavuluri Ganitam Revised
Author: Dr. Remella Avadhanulu
Publisher: Shri Veda Bharathi
Pages: 417Language: Telugu
వేదగణితం పురాతనమైన, గహనమైన, విస్తృతమైన శాస్త్రం. చాలాకాలం వరకూ, అది జ్యోతిష శాస్త్రంలో భాగంగా పరిగణించబడేది. క్షేత్రగణితానికి పునాదిగా, సులభ సూత్రాలనే పేరుతో ఇది కల్ప శాస్త్రంలో పాక్షికంగా ప్రస్తావించబడింది. ఈ శాస్త్రంలో - ఆర్యభట్ట, భాస్కరాచార్య, బ్రహ్మగుప్త, పావులూరి మల్లన్న వంటి నిష్ణాతులైన గణితశాస్త్రజ్ఞులు ఎందరెందరో ఉన్నారు. ఇటీవలి కాలంలో స్వామి శ్రీ కృష్ణ తీర్థ రచించిన "వేదిక్ మాథమేటిక్స్"అనే గ్రంథం భారతదేశంలోనూ, ప్రపంచమంతటా అందరి దృష్టిని ఆకర్షించింది. సంప్రదాయేతర విధానం, హై స్పీడ్ అరిథ్మెశటిక్స్, అత్యంత వినియోగశీలత వంటి ప్రయోజనాలు ఈ శాస్త్రాన్ని ఈ పోటీ ప్రపంచంలో విద్యార్థుల చెంతకు చేరుస్తాయి.
శ్రీ వేద భారతి సంస్థ ప్రచురించిన వేదగణితం పుస్తకాలు పైన చెప్పిన ముఖ్యమైన అంశాలలో వ్యవహరిస్తాయి, మన ఘనమైన పరంపరని ఉజ్వలంగా వివరిస్తాయి. మూలాలను లెక్కించడం, వర్గమూలాలను, ఘనమూలాలను కనుగొనడం, చతుర్థ, పంచమ ఘాతాంక మూలాలు... మొదలైన అంశాలు విశేషరీతిలో ఏరికూర్చి వివరించబడ్డాయి. దీనివలన అధ్యాపకులకు, విద్యార్థులకు కీలక సూత్రాలపై మరింత అవగాహన కలుగుతుంది.
విద్యార్థులు తమ మానసిక అవరోధాలను అధిగమించేందుకు మాత్రమే, ఉద్దేశపూర్వకంగానే, మా పుస్తకాలలో వేదగణితం పాఠ్యాంశాలను పలురకాల చిన్న చిన్న అంశాలుగా విభజించాము.
- ₹120
- ₹450
- ₹72
- ₹810
- ₹72
- ₹540
- ₹120
- ₹450
- ₹480
- ₹72
- ₹810
- ₹72
Too much overpriced, love to see at reasonable price or rent option so that everyone gets interested and read it.
Knowledge in book is definitely priceless, but as a book its not worth the price at all.
Waiting for a Rent Option