-
-
వాత్సల్య గోదావరి
Vatsalya Godavari
Author: Mani Vadlamani
Publisher: J.V.Publications
Pages: 200Language: Telugu
కొత్త కథాసంపుటికి స్వాగతం!
సాహితీ విదుషీమణి - శ్రీమతి మణి వడ్లమాని! 2010లో కథారచన మొదలెట్టి అతి వేగంగా తెలుగులోని అన్ని ప్రముఖ పత్రికల్లోనూ 40కి పైగా కథల్ని రాశారు. ఆమె మొదటి కథ 'కృష్ణం వందే జగద్గురుం’ కౌమదిలో ప్రచురితమయింది. ఆ కథ కూడా ఇప్పుడీ సంపుటిలో ఉంది. శ్రీమతి మణి తొలి నవల ‘జీవితం ఓ ప్రవాహం’ చతుర మాసపత్రికలో వచ్చింది. వంగూరి ఫౌండేషన్ అమెరికా, తెలంగాణ అసోసియేషన్, గో తెలుగు.కామ్ వంటి సంస్థలు నిర్వహించిన కథారచన పోటీలలో మణిగారికి ప్రతిష్ఠాత్మకమైన బహుమతులూ, పురస్కారాలూ లభించాయి. ఇవ్వాళ - మణి వడ్లమాని పేరు తెలుగు పత్రికా పాఠకులకు సుపరిచితం. ఇది ఆమె తొలి కథా సంపుటి. అభినందనలు!
ఈ సంపుటిలో 24 కథలున్నై. కథావస్తువుల్లోని వైవిధ్యాన్ని ఒక్క పోలికతో చెప్పాలంటే - అవన్నీ ఇంటింటా జరుగుతున్న రామాయాణాలు, మహాభారతాలూ కొన్ని కొన్ని మహా భాగోతాలు! ఆ విధంగా - కథల్లో మణిగారి అధ్యయనశీలం, సమాజ పరిశీలనా దృష్టీ, జీవితానుభవాల సారం - విస్తృతంగా ప్రతిఫలిస్తున్నై.
- విహారి
