-
-
వాస్తవం నుంచి వాస్తవంలోకి
Vastavam Nunchi Vastavamloki
Author: Suryadevara Rammohana Rao
Publisher: Madhu Priya Publications
Pages: 252Language: Telugu
''నేను ఎవర్నీ పెళ్ళి చేసుకోను. చేసుకుంటే నేను ఎన్నో ఆదర్శాలు, ఆనందాలు వదులుకోవాల్సి వుంటుంది. ఉద్యోగం - ఇల్లు... ఇదే జీవితం అవుతుంది. నాకది ఇష్టంలేదు. నేను డైలీ ఆఫీస్‌కి వెళతాను. ఆఫీస్ అవర్స్ అయ్యాక నా వ్యక్తిగత అభిరుచులు తీర్చుకోడానికి ప్రయత్నిస్తాను. అది సాహిత్యమైనా, పెయింటింగ్స్ అయినా సంఘసేవయినా కావొచ్చు. పెళ్ళయ్యి భార్య ఇంట్లోవుంటే ఇవన్నీ కుదరవు. నా దోవన నేను తిరుగుతూ వుంటే నీ ఇంటికి నేను కాపలా కుక్కనా అని ఆవిడ అడగొచ్చు. నా సరదాలు నేను తీర్చుకుంటూ ఎంజాయ్ చేస్తుంటే భార్య ఇంట్లో ''అలో లక్ష్మణా! అని ఏడవడం ఎందుకు?''
''ఆవిడ కూడా తనకిష్టమైన జీవితం గడపొచ్చు కదా?''
''ఎవరి జీవితాలు వారికిష్టమైన రీతిలో నడుపుకునేటప్పుడు పెళ్ళి అవసరం ఏముంది? కానీ... నేనూ మనిషినే. నాకూ అభిమానాలు, మమతలు వుంటాయి. జీవితమంతా నిస్సారంగా గడపడం నాకూ ఇష్టం వుండదు. మన
పనుల్లో అలిసిపోయి జీవితం మొనాటనస్‌గా కనిపించినప్పుడు ఉత్సాహాన్ని రేకెత్తించే తోడు ఎంతయినా అవసరం. అయితే ఆ తోడు మన నీడలా కాక స్వతంత్రంగా వుండాలి. అందుకే పెళ్ళి ప్రసక్తి లేకుండా ఎవరింట్లో వాళ్ళుంటూ మానసికంగా, శారీరకంగా జీవితాంతం అనుబంధాన్ని కొనసాగిద్దామన్నాను.''
''మైగాడ్...'' రెప్పలార్పడం కూడా మర్చిపోయి చూస్తుండి పోయింది సింధు.
''సింధూ! నా మనస్తత్వానికి భయపడుతున్నారా?''
''లేదు కానీ అసలేం అర్థంకావడంలేదు.''
Chandalamaina concept
Didn't expect this from Suryadevara