-
-
వసంతం
Vasantam
Author: P.Vasantha Laxmi
Publisher: Self Published on Kinige
Pages: 200Language: Telugu
చాలా కాలం తర్వాత వేరే ఊరి నుంచి వచ్చిన అక్క, చెల్లి, పిన్ని లేదా అత్తయ్యతో కబుర్లు చెప్తుంటే ఎలా ఉంటుంది? సాయంకాలం బీచ్ కనబడేలా అపార్ట్మెంట్ బాల్కనీలో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటే? వెన్నెల్లో సముద్రపు ఒడ్డున ఇసుకలో కూర్చొని పిల్లలతో పాటు కార్నిటో ఐస్క్రీం తింటూ ఉంటే... నది ఒడ్డున చల్లటి గాలిలో నడుస్తూ ఉంటే ?.... శ్రీమతి లక్ష్మీ వసంత గారి పోస్ట్స్, కథలు ఎప్పుడు చదివినా సరిగ్గా ఇలానే ఉంటుంది. మనసుకి ఎంతో హాయిగా ఆహ్లాదంగా, గుండె లోతుల్లో నించి సంతోషం ఉప్పొంగి బయటకు వస్తున్నట్లుగా, మధుర సంగీతం ఏదో వింటున్నట్లుగా కథకి కావలసింది వ్యాకరణాలు, సమాస భూయిష్టమైన పెద్ద పెద్ద పదాలు, ప్రాసలు, గురు లఘువులు కాదు... ఆకట్టుకునే కథనం ... వాస్తవిక దృక్పధం, పాత్రలని మలచడంలో ఔచిత్యం, కవి మనసులో నించి వ్యక్తమయ్యే అద్భుత భావాలు... కళ్ళకి కట్టినట్లుగా వర్ణించటం, ఎదురుగా కూర్చొని మాట్లాడుతున్నట్లుగా అనిపించటం శ్రీమతి లక్ష్మీ వసంత గారి ప్రత్యేకత.
వసంత... వేసవి కాలంలో చల్లని సాయంత్రం మదిని మైమరపించే సమ్మోహన రాగం.
- నీలంరాజు శ్రీధర్.
