-
-
వరుగులు, వడియాలు
Varugulu Vadiyalu
Author: Yalamarti Anuradha
Publisher: Victory Publishers
Pages: 91Language: Telugu
ఆరోగ్యకరమైన, రుచికరమైన వరుగులు, వడియాలు ఇంట్లోనే తయారు చేసుకునే పద్ధతులు వివరిస్తున్నారు రచయిత్రి. ఇవే కాకుండా, ఈ పుస్తకంలో అప్పడాలు, చారు, చారు పొడి, సాంబార్, సాంబారు పొడి, పులుసులు ఎలా తయారుచేసుకోవాలో తెలియజేసారు.
* * *
ఒక కాలంలో దొరికే కూరగాయలు మరో కాలంలో దొరకవు. కానీ మనం మాత్రం ఎప్పుడు కావాలంటే అప్పుడు తినడానికి ఈ 'వరుగులు' ఉపయోగపడతాయి. అంతే కాదండీ, పనికిరాదని పారేసే ముదురు కూరగాయలని పారేయకుండా ఉపయోగపరుచుకునే సాధనమే ఈ 'వరుగులు'. వీటిని మంచి ఎండలో ఒకటి, రెండు రోజులు ఎండబెడితే రెండు సంవత్సరాల దాక చెడిపోవు, పురుగూ పట్టదు. చలికాలంలో తయారు చేసిన 'వరుగుల'ని తప్పనిసరిగా ఎండాకాలంలో ఎండబెట్టాలి. మంచి డబ్బాలో జాగ్రత్త చేసుకుంటే మళ్ళీ వీటిని తిరిగి చూడాల్సిన పనే ఉండదు, తినాలనుకున్నప్పుడు తప్ప!
* * *
వడియాలు లేకుంటే సాంబారు కానీ చారు కానీ తినాలనిపించదు. నిజం చెప్పాలంటే అప్పడాలు, వడియాలు భార్యాభర్తల్లా విస్తరిలో నిండుగా కనిపించాలి. ఎవరు లేకపోయినా జీవితానికి లోటే అన్నట్లు ఈ రెండూ ఉంటేనే విస్తరికి గానీ, ప్లేటుకిగానీ అందం. మరింకేం, వడియాలలో రకాలు ఏమిటో పట్టు పట్టేద్దాం!
- యలమర్తి అనూరాధ
