-
-
వర్ణం
Varnam
Author: Kesava.Dasu
Publisher: Self Published on Kinige
Pages: 168Language: Telugu
నాటి తరం మనిషి మనుగడ బంధాలు, బంధువులు, ప్రేమలు, ఆప్యాయతల మధ్య సాగితే...
నేటి తరం మనిషి మనుగడ డబ్బు, ఈర్ష్య, ద్వేషాలు, ఒంటరితనం, ఒకరి మీద ఒకరికి ఓర్వలేనితనం మధ్యలో సాగుతోంది. నాటి తరం ఉమ్మడి కుటుంబాలకి పెద్దపీట వేసి, అందరూ ఒకే ఇంట్లో కలసి మెలసి సుఖసంతోషాలను పంచుకుంటూ జీవించేవారు. జాతికి "కలసి వుంటే కలదు సుఖం" అనే సందేశాన్ని చెప్పేవారు. నేటి తరం ఉమ్మడి కుటుంబాలలో స్వేచ్ఛ లేదు అని చెప్పి వేరే కాపురాలు పెట్టుకుంటున్నారు, వేరే కాపురం పెట్టినప్పటి నుంచి నువ్వు వేరు నేను వేరు అని భార్యాభర్తలు విడిపోతున్నారు. వ్యక్తిగత స్వేచ్ఛ, వ్యక్తిగత స్వాత్రంత్ర్యం సుఖాన్ని ఇవ్వవు, ఒంటరితనాన్ని తప్ప అని ఆలోచించలేకపోతున్నారు. ఒక మనిషి బాగుంటేనే కుటుంబం బాగుంటుంది అని, ఒక కుటుంబం బాగుంటేనే ఊరు బాగుంటుంది అని, ఒక ఊరు బాగుంటేనే సమాజం బాగుంటుందని, ఒక సమాజం బాగుంటేనే ప్రపంచం బాగుంటుందని అని ఎవరో పెద్దలు చెప్పిన మాటల అర్థం తెలుసుకోలేకపోతున్నారు.
జగమంతా ఒక వసుధైక కుటుంబం అవ్వాలని, చిన్న చిన్న సమస్యలకి కొట్టుకొని బంధాలని, బాధ్యతలని వదిలేయకూడద్ని చెప్పటమే ఈ "వర్ణం" ముఖ్య ఉద్దేశం.
- రచయిత
'Varnam' spekas volumes of the writer's interest in bettering Man, society and the world.Change to change. I'm sure the story brings out what the writer aims at. The readability works it out. 'A reader.'