• Vargala Gurinchi Marx Engelslu Em Chepparu
  • Ebook Hide Help
    ₹ 50
    50
    0% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వర్గాల గురించి మార్క్స్ - ఎంగెల్సులు ఏం చెప్పారు?

    Vargala Gurinchi Marx Engelslu Em Chepparu

    Author:

    Pages: 254
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

మార్క్సు- ఎంగెల్సులు ఇద్దరూ 'వర్గాల' గురించి, ప్రత్యేకంగా, ఒక విడి పుస్తకం గానీ, ఒక విడి వ్యాసం గానీ, రాయక పోయినా, మనం వాళ్ళిద్దరి రచనలన్నిటినీ, మొదటి నుంచీ-చివరి వరకూ చూసి, 'వర్గాల' గురించి వాళ్ళు ఎక్కడెక్కడ ఏమేమి చెప్పారో వాటిని ఒక చోట కూర్చి, వాటి సారాంశాన్ని గ్రహించాలి.

మార్క్సు - ఎంగెల్సుల ప్రకారం, 'వర్గాలు' అంటే, అవి పెట్టుబడిదారీ సమాజంలో స్పష్టమైన రూపాల్లో, రెండే వర్గాలు ప్రధానమైనవి. పెట్టుబడి దారీ (బూర్జువా) వర్గమూ; కార్మిక వర్గమూ. ఈ రెండు వర్గాలే కాకుండా, రెంటికీ మధ్య కొన్ని చిన్న ఇతర వర్గాలు కూడా వుంటాయని మార్క్సు-ఎంగెల్సులు వివరిస్తారు. ఆ ఇతర చిన్న వర్గాలు ఇవీ: పెటీ బూర్జువాలూ, స్వతంత్ర ఉత్పత్తి దారులూ, 'అలగా' శ్రామికులూ! ఏ ప్రధాన వర్గంలో అయినా, కొన్ని విభాగాలు (సెక్షన్లు) ఉంటాయి. విభాగాలు ఎన్ని వున్నా, అవి శ్రమలు చేస్తూ బ్రతుకుతాయా, ఇతరుల శ్రమల్ని దోస్తూ బ్రతుకుతాయా— అనేది చూడాలి.

వర్గాల గురించి, వాటి ఆదాయాల గురించీ, వాటి ప్రయోజనాల గురించీ, సంబంధాల గురించి, వాటి మధ్య వుండే వైరుధ్యాల గురించి, వాటి పోరాటాల గురించీ, వివరంగా అర్ధం చేసుకోవాలి. దాని కోసం 'ఉత్పత్తి విధానం' అంటే ఏమిటీ, 'శ్రమ క్రమం' అంటే ఏమిటీ, 'శ్రమ విభజన' అంటే ఏమిటీ-వంటి విషయాల గురించి తెలుసుకోవాలి. అప్పుడే, ఏ దేశం లోనైనా ఏ వర్గాలు యజమాని వర్గాలుగా వున్నాయో, వాటి శ్రమ దోపిడీని నిలబెట్టే ప్రభుత్వాలు ఎలా ఉన్నాయో గుర్తించడమూ, దానికి తగిన రాజకీయ కార్యాచరణను ఎంచుకోవడమూ, దాని ద్వారా శ్రమ దోపిడీ నించి బైట పడే 'సమానత్వ సమాజం' కోసం ప్రయత్నించడమూ కార్మిక వర్గానికి సాధ్యం అవుతుంది.

- రంగనాయకమ్మ

Preview download free pdf of this Telugu book is available at Vargala Gurinchi Marx Engelslu Em Chepparu