-
-
వారసులు
Varasulu
Author: Madireddy Sulochana
Publisher: Navodaya Publishers
Pages: 214Language: Telugu
దాదాపు నలభై యేళ్ళ క్రితం నాటి అచ్చమైన తెలంగాణా వాతావరణం, పొందికైన మానవ సంబంధాలూ కలగలిపిన చక్కని యితివృత్తాలు మాదిరెడ్డి సులోచన సాహిత్యంలో కనిపిస్తాయి. డెబ్భ్షె పైగా నవలలు ఆమె రచించారు. వాసిలోనూ, రాసిలోనూ కూడ సులోచన రచనలు ఎన్నతగినవే. గడచిన నలభై సంవత్సరాలలో ఆర్ధిక, సాంఫిుక, సాంస్కృతిక రంగాలలో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఆనాటి రూపాయికి, నేటి రూపాయికి పొంతన లేదు. కొన్ని వూళ్ళపేర్లు, కొన్ని మాటల అర్థాలు సైతం మారిపోయాయి. వేషధారణ మారింది. దూరాలు తగ్గిపోయాయి. భూగోళం గుప్పెట్లో వొదిగిపోయింది. ఆచార వ్యవహారాలలో, మాటతీరులో వున్నట్టుండి ఎన్నో మార్పులు వచ్చాయి. గత పదిహేను యిరవై సంవత్సరాలలో యీ మార్పు అత్యంత వేగంగా జరిగింది. ఎన్ని మార్పులు వచ్చినా మానవనైజాలు, ప్రవృత్తులు ఎన్నటికీ మారవు. ప్రేమ, ద్వేషం, స్వార్ధం లాంటి ముడిదినుసుకు యెన్ని తరాలు గడిచినా చలనం వుండదు. అందుకే మాదిరెడ్డి సులోచన కాల్పనిక సాహిత్యంలో మౌలిక అంశాలు నేటికీ నూతనంగానే వుంటాయి.
* * *
"అతనికి బాలామణి యెడబాటు సహించలేనిదిగా వుంది. ఆమెను చూడగానే ఎండలో నుండి నీడకు చేరినవాడు పొందే హాయి, అనుభూతి పొందేవాడు. కొన్ని సంఘటనలకు అర్థం చెప్పలేనట్టు చిత్రంగా జరిగి పోతుంటాయి. సీతారామిరెడ్డికి పరస్త్రీ వ్యామోహం లేదు. అలాంటి నైజమే అయితే అతని డబ్బును ఆశించి వచ్చే స్త్రీలు కోకొల్లలు. అతను ఆత్మీయత కోసం అలమటిస్తూ బాలామణి చెలిమి కోరాడు. అందుకే మరో స్త్రీ కావాలని కోరలేదు అతని మనసు. బాలామణి చురుకయిన స్త్రీ, అభిమానము, అభిజాత్యమున్న యువతి. అభిమానముతోనే సాయిల్ను పెళ్లి చేసుకుంది. అభిజాత్యముతోనే రెడ్డిని వదిలింది. ఆమెకు కావల్సింది ఒక శారీరక వాంఛలు నెరవేరటమే కాదు. తనను భర్తగా కాకపోయినా, వ్యక్తిగా అతను గౌరవించాలని, తన పిల్లలే వారసులవుతారని వాంఛించింది.దానిపై తిరుగులేని దెబ్బతీశాడు సీతయ్య దత్తు చేసుకుని."
Liked it. Sustained interest till the end and i felt there are strong characters that inspire in their own way.
To the Kinige team: How about adding a rating/like-dislike thing on the site instead of linking to FB, twitter etc?
vbsr,
Thank you for your comments. Rating feature is something we designed from day1, but not yet completed! You will have it in our upcoming upgrades.