• Varada Swarnakshari
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వరద స్వర్ణాక్షరి

    Varada Swarnakshari

    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అనంత కాలగమనంలో యాభై సంవత్సరాలు పెద్ద కొలమానం కాకపోవచ్చు. కానీ ఒక వ్యక్తి జీవితంలో, ఒక వ్యవస్థ ప్రస్థానంలో అది ఎన్నదగిన ప్రమాణమే. అందుకే ఈ ప్రయత్నం. అందుకే ఈ అక్షరమాలిక. అందుకే ఈ స్వర్ణోత్సవ సంబరం.

ఐదు పదులుగా గోవర్ధన సుందర వరదాచార్యులు సాగిస్తూ వచ్చిన కృషిని సమీక్షించుకోవటానికి, ఆయన పెంచి పోషిస్తూ వచ్చిన విలువలను వీక్షించడానికి, గత అర్ధశతాబ్ది కాలంలో పత్రికారంగంలో వచ్చిన మార్పులను మననం చేసుకోవటానికి, భవిష్యత్ తరాలకు బాసాటగా, ప్రేరణగా నిలవడానికి "వరద స్వర్ణాక్షరి"ని వెలువరిస్తున్నాం.

బహుముఖంగా సాగిన వరదాచారిగారి కృషిని దృష్టిలో పెట్టుకుని ఈ పుస్తకాన్ని తొమ్మిది ప్రధాన అధ్యాయాలుగా విభజించాం. ఆయా రచనల ఇతివృత్తాన్ని దృష్టిలో పెట్టుకుని అనువైన అధ్యాయంలో వాటిని పొందుపరిచాం. ప్రతీపేజీ ఆస్వాదయోగ్యంగా ఉండేలా తీర్చిదిద్దడానికి ప్రయత్నించాం.

ఓ అక్షరాయుధుడికి, ఓ అవిశ్రాంత పథికుడికి చేస్తున్న అక్షరాభిషేకం ఇది.

- జి. యస్. వి. స్వర్ణోత్సవ సంఘం

Preview download free pdf of this Telugu book is available at Varada Swarnakshari