-
-
వంగూరి చిట్టెన్ రాజు చెప్పిన నూటపదహారు అమెరికామెడీ కథలు
Vanguri Chitten Raju Cheppina Nootapadahaaru Amerikaamedy Kathalu
Author: Dr. Vanguri Chitten Raju
Publisher: Vanguri Foundation of America
Pages: 476Language: Telugu
చిట్టెన్ రాజుగారు నవ్వే పనిలో శ్రోతల్నీ, పాఠకులనీ 'బిజీ'గా ఉంచి అమెరికా నేపథ్యంలో పలురకాల మనుషుల ప్రవర్తన మీద తను అనదల్చుకున్న నాలుగు మాటలు అనేసారు.
- ఇంద్రగంటి శ్రీకాంత శర్మ (హైదరాబాద్)
* * *
కేవలం అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలుగులో ఆరోగ్యకరమైన హాస్యాన్ని నిరాటంకంగా రాసే రచయితల్లో చిట్టెన్ రాజుగారిని ముందువరుసలో కుర్చీ వేసి కూర్చోబెట్టవచ్చు - అని నేనంటే ఈ పుస్తకం చదివాక మీరూ నాతో ఏకీభవిస్తారని ఆశిస్తున్నాను.
- కిరణ్ ప్రభ (కేలిఫోర్నియా)
* * *
చిట్టెన్ రాజుగారి రచనలు 'రచన'లో ధారావాహికంగా ప్రచురించడం జరిగింది. ఇది పాఠకులకు అత్యంతామోదకర సంతోషాన్నిచ్చాయన్నది నిఘంగా నిజం!
- 'రచన' శాయి (హైదరాబాద్)
* * *
వంగూరి చిట్టెన్ రాజుగారు ఒక ప్రత్యేకమైన శైలీ, ధోరణీ కల కథకుడు. మహాకథకుని వలె పాఠకుడిణ్ణి ప్రతీ వాక్యం చదివించే రచనాశక్తి కలవాడు. ఈ అమెరికామెడి కథలు మూడు, నాలుగు చదివితే ఇక మిగిలిన కథలనూ చదవకుండా ఉండలేరు.
- జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు (హైదరాబాద్)
* * *
ప్రవాసాంధ్రుల జీవితాలకి అద్దం పట్టి, వారి జీవిత ధ్యేయాలని విశదీకరించి, విమర్శించి, ఎవరి మనస్సూ నొప్పించకుండా ఉన్న రహస్యాలు బయట పెడుతూ హృదయోల్లాసంగా మనందరికి మనల్నే పరిచయం చేస్తున్న హాస్యరసపూరిత హావభావాలు ఈ సంకలనంలో నాట్యం చేస్తున్న కామెడీ కథలు.
- పెమ్మరాజు వేణుగోపాలరావు (అట్లాంటా)
* * *
మబ్బు పట్టిన మనస్సులకి ఆరోగ్యకరమైన, అందమైన విరుగుడుని ఈ కామెడీ కథల ద్వారా చిట్టెన్ రాజుగారు మీకు కల్పిస్తారు. అటు తర్వాత అర కప్పు టీని శృతి చేయండి. మీ జన్మ ధన్యమౌతుంది.
- గొల్లపూడి మారుతీరావు (చెన్నై)
- ₹450
- ₹65.004
- FREE
- ₹60
- ₹108
- ₹90.00
Too much cost....
I can't...
765 అంటే ఎక్కువేమో అని అనిపిస్తుంది .
Konataniki Aalochistharu Sir, Cost Chaala ekkuva.