-
-
వంశీకి నచ్చిన కథలు
Vamsy Ki Nachina Kathalu
Author: Vamsy
Publisher: Sahiti Prachuranalu
Pages: 470Language: Telugu
వీటిలో నా చిన్నప్పుడు పసలపూడి పంచాయితీ గ్రంథాలయంలో కూర్చుని చదివిన కథల నుంచి నిన్నమొన్న పత్రికల్లో వచ్చిన కథల వరకు వున్నాయి. ఠాగోర్ బెంగాలీ కథకు నాకొచ్చిన భాషలో నేను చేసిన స్వేచ్ఛాను వాదం నుంచి నాటికగా ప్రాచుర్యం పొందిన మిత్రులు కీIIశేII గోపాలరాజుగారి రాయికి నేనిచ్చిన కథారూపం వరకు వున్నాయి. నేను పుట్టక పూర్వమెప్పుడో అచ్చయిన 1952 నాటి దొంగలున్నారు జాగ్రత్త కథ నుంచి నిన్న మొన్నటి అమ్మమ్మ చదువు వరకు వున్నాయి. ఆర్తనాదము, మా బావమరిది పెళ్ళి వంటి బాగా పాతకాలం కథలతో పాటు భాషాపరంగా కొత్త పోకడలు పోయిన ఈ దశాబ్దంలోని కథలూ వున్నాయి. ఇక వస్తుపరంగా అన్నీ వైవిధ్యమున్నవే అని నా నమ్మకం. మూసకథలకు భిన్నంగా అరుదైన కోణాలను స్పృశించి ఆవిష్కరించినవే అనుకుంటున్నాను. మంత్రసాని, బైరాగి, సీతమ్మ లోగిట్లో, వైతరణికీవల... మొదలైనవి ఈ కోవకి చెందిన అపూర్వమైన అసాధారణమైన కథలు.
- వంశీ
