-
-
వాల్మీకిరామాయణము
Valmiki Ramayanamu
Author: V. Kameswara Rao
Publisher: Self Published on Kinige
Pages: 311Language: Telugu
రామాయణాన్ని పరమపవిత్రమైన భక్తివేదంగా పఠించి, పారాయణ చేసి పరవశించి తరించినవారు కొందరు. దానిని మహోత్కృష్టమైన కావ్యంగా అధ్యయనం చేసి పులకించిపోయినవారు కొందరు. ఒక గొప్ప కథగా మాత్రమే చదివి, ఏ మాత్రం ఉత్కంఠ (సస్పెన్సు) లేకపోయినా వదలకుండా చదివించిన కథనకౌశలానికి ముగ్ధులైపోయినవారు కొందరు.
ఎవరెలా చదివినా రామాయణం ఈ జాతి హృదయస్పందన. మానవజీవితానికి చుక్కాని. అభ్యుదయపథంలో సాగాలనుకునేవారికి దిక్సూచి.
వాల్మీకి చెప్పిన కథాక్రమాన్ని కచ్చితంగా అనుసరిస్తూ, సందేశాత్మకవాక్యాలు వదలకుండా, స్వంతభావాలు ఎక్కడా చొప్పించకుండా, మహర్షి ఒరవడి పెట్టిన ప్రవాహినీలక్షణం ఉండేలా వ్రాయడానికి ప్రయత్నించాను.
కొన్ని చోట్ల - అవి చాలా తక్కువే అయినా - కథనం కలిసేందుకు కొన్ని వాక్యాలు (స్వంతంగా) వ్రాయవలసివచ్చింది. వాటిని బ్రాకెట్లలో ఇటాలిక్స్లో పెట్టాను.
ప్రసిద్ధమైన శ్లోకాలు కొన్ని, విషయం ప్రామాణికమని తెలిపే శ్లోకాలు కొన్ని, వాల్మీకి ఒక్కొక్క విషయాన్ని ఎంత సున్నితంగా (subtle గా) చెప్తారో తెలియచేసే శ్లోకాలు కొన్ని చేర్చాను. వాటికి అన్వయానుసారంగా తాత్పర్యం కాకుండా కథనంలో ఇమిడే భావం మాత్రమే వ్రాసాను.
ఏమైనా ఇది కొండను అద్దంలో చూపించే ప్రయత్నమే. ఈ ప్రయత్నం చెయ్యడానికి కావలసిన శక్తి ఇచ్చినది శ్రీరామచంద్రుడి కృప. ఆపైన శ్రీరామచంద్రుడిగారి ఆశీర్వాదం. శ్రీరామచంద్రౌ శిరసా నమామి.
- ఉప్పులూరి కామేశ్వరరావు
