• Vaignanika Bhoutikavadam
  • Ebook Hide Help
    ₹ 113
    125
    9.6% discount
    • fb
    • Share on Google+
    • Pin it!
  • వైజ్ఞానిక భౌతికవాదం

    Vaignanika Bhoutikavadam

    Pages: 179
    Language: Telugu
    Rating
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    Be the first to vote
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    0 Star Rating: Recommended
    '0/5' From 0 premium votes.
Description

అసమాన ప్రతిభా సంపన్నుడు, మహోన్నత మానవుడు, మహాపండిత రాహుల్ సాంకృత్యాయన్‌ను తెలుగువారికి కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఆయన రచనలు తెలుగు పాఠకులకు సుపరిచితాలే. ఆయన రచనలను విశాలాంధ్ర ప్రచురణాలయం ఇదివరకే కొన్ని ప్రచురించింది. ఇప్పుడు ఈ 'వైజ్ఞానిక భౌతికవాదం' అనే పుస్తకాన్ని మీకందిస్తున్నందుకు సంతోషిస్తున్నాం. దీన్ని శ్రీ ఆలూరి భుజంరావు గారు, వారి కుమార్తె శ్రీమతి ఆలూరి కామేశ్వరి (కవిని ఆలూరి) గారు అనువదించారు. ఆలూరి భుజంగరావు గారు తెలుగువారికి సుపరిచితులు. రాహుల్జీ రచనలలో చాలా వాటిని ఆయనే అనువదించారు. అనారోగ్య కారణాల వల్ల ఆయన ఈ పుస్తకం అనువాదాన్ని పూర్తి చేయలేకపోయారు. భుజంగరావుగారు మెదడుకు సంబంధించిన అనారోగ్యం కారణంగా 20-6-2013న అమరులయ్యారు. తండ్రి వారసత్వాన్నందుకొన్న శ్రీమతి కామేశ్వరి తరువాయి భాగాన్ని (సగానికి పైగా) అనువదించి ప్రచురణార్థం మాకందించినందుకు ఆమెకు ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు. ఆమె తన కృషిని ఇంతటితో ఆపకుండా మరిన్ని మంచి రచనలను తెలుగు పాఠకులకు అందించాలని కోరుకుంటున్నాము.

ఇక ఈ పుస్తకం గురించి తెలుగులో 'గతితార్కిక భౌతికవాదం'గా ప్రసిద్ది చెందిన వాదాన్నే రాహుల్జీ 'వైజ్ఞానిక భౌతికవాదం' అన్నారు. ఈ పుస్తకాన్ని చదివేటప్పుడు పాఠకులు కొన్ని విషయాలను దృష్టిలో వుంచుకోవాలి. దీన్ని రాహుల్జీ 1942వ సం||లో రచించారు. ఆనాటికి మార్క్సిస్టు సాహిత్యం ఎక్కువగా భారతదేశంలో అందుబాటులో లేదు. అయినప్పటికీ అందుబాటులో వున్న గ్రంథాలసాయంతోనే గొప్ప వివరణాత్మకంగా రాశారీ పుస్తకాన్ని, ఆయనుదహరించిన శాస్త్రీయ ఆవిష్కరణల సమాచారంలో కొంతభాగానికి తరువాత కాలంలో సవరణలు జరిగినా అవి మౌలికంగా సరియైనవే! ఆయన జ్ఞానతృష్ణకు, పాండిత్యానికి ఇవి మచ్చుతునకలు.

- రావు కృష్ణారావు

Preview download free pdf of this Telugu book is available at Vaignanika Bhoutikavadam