-
-
వాడుక భాషే రాస్తున్నామా?
Vaduka Bhashe Rastunnaamaa
Author: Ranganayakamma
Publisher: Sweet Home Publications
Pages: 175Language: Telugu
'భాష' అనేది, మొదట 'మాట్లాడే భాషే'. మాట్లాడే భాష ఏర్పడిన తర్వాతే దాన్ని'రాయడం' అనేది వచ్చింది. కాబట్టి, రాసే భాష, మాట్లాడే భాషని బట్టే వుండవలసి వుంటుంది. అంటే మాట్లాడే భాష ఏ సూత్రాలతో వుంటుందో ఆ సూత్రాలతోనే రాసే భాష కూడా ఉండాలి.
రాసే భాషలో తప్పొప్పుల గురించి అర్థం చేసుకోవాలంటే, మొదట మాట్లాడే భాషలో వుండే సూత్రాలేమిటో చూసి, వాటిని రాసే భాషలో కూడా సరిగా అనుసరిస్తున్నామో లేదో పరిశీలించుకోవాలి.
ఆ సూత్రాలన్నిటినీ మాట్లాడే భాషలో అయితే మనకు తెలియకుండానే అవలీలగా పాటిస్తూ మాట్లాడుతూ వుంటాము. ఒకే ప్రాంతానికి చెందిన మనుషులు, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ వుంటే, ఒకరు మాట్లాడేది ఒకరికి అర్థం కాకపోవడం అనేది వుండదు.
కానీ, భాషని 'రాయడం' దగ్గరికి వచ్చేటప్పటికే వస్తుంది గొడవ అంతా. మాట్లాడేటప్పుడు ఎన్నడూ జరగని రక రకాల తప్పులు, రాసే భాషలో జరుగుతూ వుంటాయి. కొన్ని సార్లయితే, ఒకరు రాసింది ఒకరికి అర్థం కాకుండా పోతుంది. దీనికి కారణం ఏమిటి - అని చూస్తే, మాట్లాడేటప్పుడు సహజంగా అనుసరించే ఏదో సూత్రాన్ని, ఆ రాసిన భాషలో అనుసరించలేదని తేలుతుంది.
