-
-
వచన గబ్బిలం
Vachana Gabbilam
Author: B. Ramakrishna
Publisher: Payasi Prachuranalu
Pages: 44Language: Telugu
'గబ్బిలం' కావ్యం సాంఘిక సామాజిక కోణంలోంచే కాదు, హేతువాద దృక్పథానికి కాగడా చూపిన తొలి ఆధునిక కావ్యం.
జాషువా పద్యాలు గద్యానికి లొంగవు. దానికి సరిపోయే ఒరిపిడి రాయి ఒకటి మన దగ్గర ఉండాలి. జాషువా పద్యాలు కంఠంలో కమ్మగా మార్మోగిస్తాయి కానీ వచనంతో చదివించవనీ అభిప్రాయం ఒకటుంది.
చాలా మందికి పైకి అర్థమయ్యేడట్లు కనిపిస్తుంది కానీ గబ్బిలం అంత సులోభకం కాదు. దానికి సాధన కావాలి, సాహిత్య సంపత్తి కావాలి. ఈ లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్నాయి కనకనే రామకృష్ణగారు అలవోకగా నల్లేరు మీద బండిలా వచన రచన రాశారు.
రామకృష్ణగారు జాషువా స్వరాల రమణీయ శైలినీ, ఆయన పద్యలాలిత్యాన్నీ, సమాస చాతుర్యాన్ని, పద్యాంతాల అసమాపక వాక్య రీతిని చాల ఒడుపుగా పట్టుకున్నారు. 'గబ్బిలం' అన్న మహాభవనానికి అంతరాయం కలగకుండా అక్షరం అక్షరంలో దాని అందచందాల్ని వచనపు నిలువుటద్దంలో చూపించడంలో రామకృష్ణగారు చాలా వరకు కృతకృత్యులయ్యారు.
ఇవాళ కొత్త ప్రపంచీకరణ తరంలో పద్యం చదివే వాళ్ళు పలచబడిపోతున్నారు. ప్రబంధాల సంగతి పక్కన పెడితే, మాములు కావ్యాలు గూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో రామకృష్ణగారు గబ్బిలాన్ని అనువదించి తెలుగు జాతికి మహోపకారం చేశారు.
- ఎండ్లూరి సుధాకర్
