-
-
ఉషశ్రీ ఉపన్యాసాలు - రామాయణ భారతాలు
Ushasri Upanyasalu Ramayana Bharatalu
Author: Ushasri
Publisher: Ushasri Mission
Pages: 117Language: Telugu
వెయ్యి మందిలో ఒకడు కవి కాగలిగతే లక్ష మందిలో ఒకడు వక్త కాగలుగుతాడని వెనకటికి సూక్తి. విభిన్నమయిన రుచులూ, అభిరుచులూ, వయస్సులూ గల శ్రోతలను ఆకట్టుకొని తాను చెప్పదలుచుకున్న విషయాన్ని స్పష్టంగా, ప్రణాళికా బద్ధంగా అశువు అల్లుకుంటూ, విసుగనిపించకుండా ఆవిష్కరించగలగడం సామాన్యమయిన విషయం కాదు. ఈ శక్తి కలిగి ఉపన్యాసాన్ని ఒక కళగా రూపొందించి తన రామాయణ మహాభారతోపన్యాసాలతో యావదాంధ్రదేశాన్నీ ఉర్రూతలూగించిన ఉపన్యాసకేసరి ఉషశ్రీ. వీరి ఉపన్యాస అనుకరణం పందిళ్ళలో అనివార్యం.
ఉషశ్రీ ఉపన్యాసాలకి ఒక ప్రత్యేకమయిన శైలి వుంది. ఆ ఊనికలనూ విరుపులనూ ఊహించుకుంటూ చదవడం మొదలుపెడితే మొత్తం ఈ పుస్తకాన్ని నలభై అయిదు నిమిషాలలో పూర్తి చెయ్యవచ్చు. అలా పరిగెత్తించే చేవగల వచనం ఇది.
ఇందులో రెండు కురుక్షేత్రాలు ఉన్నాయి - ఒకటి మహాభారత కురుక్షేత్రం, రెండోది హేతువాదులతో ఉషశ్రీ గారు పెట్టుకున్న కురుక్షేత్రం. ఇది చాలా దూకుడుగా సాగింది.
ఎవరో చెప్పిన దానిని నమ్మి రామాయణ భారతాలు పనికిమాలిన గ్రంథాలు అని నిరసించే హేతువాదులనూ, అవి పరమ పవిత్రమయిన మతగ్రంథాలు అని గుడ్డిగా ఆరాధించే చాందసులను ఇద్దరినీ సమానంగా నిందించి, ఈ రామాయణ భారతాలు మానవజాతి సర్వకాలాలలోనూ సుఖశాంతులతో మనుగడ సాధించడానికి అవసరమయిన విశేషాలను అందించే గ్రంథాలు మాత్రమే అనీ, అందుచేతనే ఇవి ఇన్నివేల సంవత్సరాలు జీవించగలిగాయనీ ఉషశ్రీ ప్రతిపాదించారు. ఇది నిజం.
ఉషశ్రీ ఉపన్యాసాలను అలా గాలిలో కలిసిపోనివ్వకుండా వాటికి అక్షరాకృతి ఇచ్చి ప్రజలు మననం చేసుకొనే వీలు కల్పించడం ముదామహం.
- ఆచార్య బేతవోలు రామబ్రహ్మం
