-
-
ఊర్వశి
Urvashi
Author: Varanasi Nagalakshmi
Pages: 32Language: Telugu
Description
ఊర్వశి (నృత్యనాటిక)
ఊర్వశీ పురూరవం! ఊహాతీతం!
అపూర్వమయిన ప్రణయ సుధా పూర్ణోదయం!
ఊర్వశీ పురూరవం! ఊహాతీతం!
సురభిళం! సుమధురం! సుందర కావ్యం!
వారణాసి నాగలక్ష్మి రచించిన కూచిపూడి నృత్య నాటిక ఊర్వశి. భార్గవీ రావు ప్రేరణతో, చలం రచించిన పురూరవ నాటికను ఆధారంచేసుకుని, రేడియోలో ప్రసారమయిన పురూరవ శ్రవ్య నాటిక విని, ఊర్వశిని సాక్షాత్కరించుకొని, ఇతివృత్తాన్ని ఆత్మగతం చేసుకుని చేసిన రచన ఇది. మొత్తం ఆరు దృశ్యాలు, 8 పాత్రలు, 20 పాటలతో వున్న ఈ నాటిక నిడివి 90 నిముషాలు. ఈ రచనలో ఊర్వశి వర్ణన, మచ్చుకి,
నీలగిరుల పైనుండి హోరున నేలకు దూకే
జలపాతపు హొయలగనీ మైమరచిన విరిబోణీ
సుగుణమణి సుభాషిణి- నీలవేణి వలపువాణి
నెమలికి నాట్యం నేర్పే - నెరజాణ కీరవాణి
Preview download free pdf of this Telugu book is available at Urvashi
Login to add a comment
Subscribe to latest comments
