-
-
ఉపనిషత్ జ్ఞాన వివేచన
Upanishat Gnana Vivechana
Author: Dr. Mallina Venkata Rao
Publisher: Mallina Venkata Rao
Pages: 197Language: Telugu
మన ప్రాచీన ఋషులు ప్రసాదించిన దివ్యమైన సందేశములే ఈనాటి మానవత్వాన్ని పోషిస్తున్నాయి. శాస్త్రములను మధించి అందించిన సుధానిధులే ఈ ఉపనిషత్తులు.
ఒక్కొక్క ఉపనిషత్తు సృష్టిరహస్యాన్ని చక్కగా వివరిస్తూ వచ్చింది. అర్థము చేసుకొనేవారు తమ తెలివితేటలను పురస్కరించుకొని అర్థము చేసుకొని, వివరించుట జరిగింది. సత్యము ఒక్కటే అయినను, ఆ పరమసత్యమును పండితులు వివిధ రకములుగా వివరించుట జరుగుచున్నది " ఏకం సత్ విప్రా బహుధా వదంతి".
ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండూక్య, తైత్తిరీయ, ఐతరేయ, శ్వేతాశ్వతర అను 9 ఉపనిషత్తుల భావార్థవ్యాఖ్యలు సర్వదేవతాతీత స్వరూప భగవాన్ శ్రీసత్యసాయీశ్వరుని సంకల్పము మరియు వారి ఆశీర్వాదము వలన 302 పేజీలలో వ్రాసికొనగలిగితిని. దీనిని అచ్చువేయించినచో సుమారు 380 పేజీల గ్రంథము అగును. దీనిని గ్రంథరూపమున ప్రచురించుట వ్యయప్రయాసలతో కూడియున్నందున విరమించితిని.
ఉపనిషత్తుల ఆధారముగా 18 విషయముల వివేచన వ్రాసికొనగలిగినచో ఉపయోగకరముగాను, సంక్షిప్తముగాను ఉండును అను ఉద్ధేశ్యముతో ఎన్నుకొనిన 18 విషయముల వివేచన 156 పేజీలలో వ్రాసికొనగలిగితిని. ఈ వివేచన ఈ గ్రంథ రూపమున ప్రచురించి భగవాన్ శ్రీసత్యసాయిబాబావారి దివ్య పాదారవిందములకు సమర్పించుచున్నాను.
- మల్లిన. వెంకట్రావు
