-
-
ఉపనయన సంస్కార సంక్షిప్త పరిచయం - రివైజ్డ్
Upanayana Samskara Samkshipta Parichayam Revised
Author: Dr. Remella Avadhanulu
Publisher: Shri Veda Bharathi
Pages: 96Language: Telugu
సనాతన ధర్మాన్ని ఆశ్రయించే ప్రతి జీవికి చేయవలసిన సంస్కారాలను మన మహర్షులు ఎప్పుడో కనుగొన్నారు. ఉపనయనం అనేది ఈ విధమైన సంస్కారాలలో ఒకటి. ఈ ఉపనయనం మనిషిలో ఉండే అజ్ఞానాన్ని తొలగించి, జ్ఞానాన్ని ప్రసాదించే ప్రక్రియను ప్రారంభించడం ద్వారా, ఉత్తమమైన, ఉన్నతమైన లక్ష్యాలు గల అసలు జీవితాన్ని ప్రారంభించునట్లు చేస్తుంది. ఈ విధంగా ఈ జన్మలోనే మరొక జన్మను ఇచ్చి, ''ద్విజత్వాన్ని'' అనుగ్రహిస్తుంది. అందుకే, ఉపనయన సంస్కారం చాలా ప్రసిద్ధి పొందింది. అనాదిగా వస్తున్న సనాతన ధర్మానికి పట్టుగొమ్మ, ఈ ఉపనయనం. అయితే శ్రద్ధ, ఆసక్తి కలవారిలో కూడ చాలమందికి ఉపనయన కార్యక్రమంలో ఏమేమి అంశాలు ఉంటాయో తెలియదు. ఉపనయనం జరుగుతూ ఉంటే, అక్కడ ఏమి జరుగుతోందో ఎవరికీ తెలియట్లేదు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని, ఉపనయనంలో ఉండే ప్రధాన ఘట్టాలను సంక్షిప్తంగా పరిచయం చేస్తున్నాము.
- డా. రేమెళ్ళ అవధానులు

- ₹120
- ₹450
- ₹72
- ₹810
- ₹72
- ₹540
- ₹120
- ₹450
- ₹480
- ₹72
- ₹810
- ₹72