-
-
ఉజ్వల భవిష్యత్తుకు మరో అడుగు
Ujwala Bhavishyattuku Maro Adugu
Author: Dr. T. S. Rao
Publisher: Victory Publishers
Pages: 162Language: Telugu
ఈ చిన్న పుస్తకం మీకు దిక్సూచిలా ఉపకరిస్తుంది. మీలోని కార్యసాధకుల్ని సరైన దిశలో నడిచేలా, సక్రమమైన నిర్ణయాలను తీసుకునేందుకు వీలుగా మిమ్మల్ని సిద్ధం చేస్తుంది
మీలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ, నిరాశ, ఆత్మన్యూనతలను తగ్గించేందుకు కిటుకులను బోధిస్తుంది. సమస్యా పరిష్కార మార్గాలను గురించి చర్చిస్తుంది. ఇంటర్వ్యూ స్కిల్స్, కెరీర్ టిప్స్‌ను సులభశైలిలో అందిస్తుంది. విద్యార్ధులకు మోటివేషన్ టిప్స్, పరీక్షలకు ముందు జాగ్రత్తల వంటివాటిని గురించి చర్చిస్తుంది.
విద్యార్ధుల మొదలు ఉద్యోగులు, వ్యాపారుల ుజ్వల భవిష్యత్తు నిర్మాణంలో మరో అడుగు ముందుకు వేసేందుకు ఈ పుస్తకం మీకు తోడూనీడలా ఉంటుంది. వివిధ సమస్యలపై చర్చిండటమే కాకుండా వాటికి పరిష్కార మార్గాలను సూచించేందుకు ప్రయత్నం చేశాను. మీరు ఆశించిన దానికంటే ఉజ్వల భవిష్యత్తును అందుకునేందుకు మీరు అర్హులని, అటువంటి భవిష్యత్తుకోసం, విజయావకాశాల కోసం ఇప్పటినుంచి సిద్ధపడమని సూచిస్తున్నాను.
- డా. టి.యస్.రావు
